Coronavirus: మెడికల్‌ కళాశాలలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌.. అప్రమత్తమైన అధికారులు

Coronavirus: కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో భయాందోళనకు గురవుతుంటే.. తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది...

Coronavirus: మెడికల్‌ కళాశాలలో 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌.. అప్రమత్తమైన అధికారులు
Coronavirus
Follow us
Subhash Goud

|

Updated on: Jan 03, 2022 | 12:10 PM

Coronavirus: కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌తో భయాందోళనకు గురవుతుంటే.. తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలలో మెల్లమెల్లగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే చాలా పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులను వెంటాడుతోంది. ఇక తాజాగా బీహార్‌ రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. పాట్నాలోని నలందా మెడికల్‌ కళాశాల, ఆస్పత్రిలో పని చేస్తున్న 87 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. కరోనా సోకిన వైద్యులకు లక్షణాలు తక్కువగా ఉన్నాయని, వారంతా ఆస్పత్రిలో క్యాంపస్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు పాట్నా డిస్టిక్‌ మెడికల్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ సింగ్‌ తెలిపారు. ఇటీవల కాలంలో పాట్నాలో జరిగిన ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కార్యక్రమంలో అనేక మంది వైద్యులు పాల్గొన్నారు. ఇందులో నలందా మెడికల్‌ కాలేజీ వైద్యులు కూడా ఉన్నారు.

అలాగే నిన్న ఉత్తరాఖండ్‌లోని జరవహర్‌ నవోదయ విద్యాలయంలో కూడా 85 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వారందరు కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇలా కరోనా సోకిన వారందరిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఒక వైపు కరోనా కేసులు, మరో వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ విజృంభిస్తుండటంతో ఆందోళన నెలకొంది.

ఇవి కూడా చదవండి:

తెలంగాణలో 15-18 ఏళ్ల యువతీ యవకులకు వ్యాక్సినేషన్ ప్రారంభం.. కాలేజీ యాజమాన్యాలకు మంత్రి హరీష్ వినతి

Numaish: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈనెల 10 వరకు నుమాయిష్‌ ప్రవేశం నిలిపివేత..!