AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

John Abraham: బాలీవుడ్‌ను వదలని కరోనా.. వైరస్‌ బారిన జాన్ అబ్రహం దంపతులు.. మరో హీరోయిన్‌ కూడా..

దేశంలో కొవిడ్‌ కల్లోలం సృష్టిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో నమోదవుతోన్న రోజువారీ కొత్త కేసులు, మరణాల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఇక మహారాష్ట్రలో మళ్లీ మునపటి దీన పరిస్థితులు పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తు్న్నాయి

John Abraham: బాలీవుడ్‌ను వదలని కరోనా.. వైరస్‌ బారిన జాన్ అబ్రహం దంపతులు.. మరో హీరోయిన్‌ కూడా..
John Abraham And Priya Run
Basha Shek
|

Updated on: Jan 03, 2022 | 1:48 PM

Share

దేశంలో కొవిడ్‌ కల్లోలం సృష్టిస్తోంది. వివిధ రాష్ట్రాల్లో నమోదవుతోన్న రోజువారీ కొత్త కేసులు, మరణాల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. ఇక మహారాష్ట్రలో మళ్లీ మునపటి దీన పరిస్థితులు పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తు్న్నాయి. ఓవైపు ఒమిక్రాన్‌ కమ్ముకొస్తుండగా.. మరోవైపు కొత్త కేసులు అమాంతం పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బాధితుల జాబితాలో చేరిపోతున్నారు. ఇక బాలీవుడ్‌లో కపూర్‌ ఫ్యామిలీతో పాటు పలువురు నటీనటులు కరోనాకు గురికాగా.. తాజాగా మరో బాలీవుడ్‌ హీరో జాన్ అబ్రహం కు కరోనా పాజిటివ్ గా తేలింది. అతడితో పాటు ఆయన సతీమణి ప్రియా రుంచల్ కు కూడా కరోనా సోకింది. వీరితో పాటు ‘జెర్సీ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ‘మృణాల్‌ ఠాకూర్‌’ కరోనా బాధితుల జాబితాలో చేరింది.

టీకాలు తీసుకున్నాం.. అయినా..

కాగా తాము కరోనా బారిన పడిన విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశారు జాన్‌ దంపతులు. ‘మూడు రోజల క్రితం మేం కలిసిన వ్యక్తికి పాజిటివ్‌ అని తేలింది. దీంతో నేను, ప్రియా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నాం. అందులో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం మేం ఇంట్లోనే ఐసోలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నాం. మేం రెండు డోసుల టీకా తీసుకున్నాం. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాం. అయినా కరోనా సోకింది. ఇద్దరికీ తేలికపాటి లక్షణాలున్నాయి. దయచేసి అందరూ మాస్కులు ధరించండి. కొవిడ్‌ నిబంధనలు పాటించండి’ అని తన అభిమానులకు సూచించారు జాన్‌. ఇక ‘జెర్సీ’ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ‘నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటికైతే కొద్దిపాటి లక్షణాలు మాత్రమే ఉన్నాయి. పెద్దగా సమస్య లేదు. వైద్యుల సలహాతో ఐసొలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలసిన వాళ్ళు తప్పకుండా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. జాగ్రత్తగా ఉండండి’ అని పోస్ట్‌ పెట్టింది మృణాల్‌.

Also Read: Director PCReddy: ప్రముఖ సీనియర్‌ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..

Dhruv Vikram : ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న విక్రమ్‌ తనయుడు?.. నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఫొటోలు..

Lionel Messi: క్రీడా రంగంలో కరోనా కలకలం.. కరోనా బారిన మెస్సీ.. మరో ముగ్గురు ప్లేయర్లకు కూడా పాజిటివ్‌..