Dhruv Vikram : ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న విక్రమ్‌ తనయుడు?.. నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఫొటోలు..

తమిళ విలక్షణ నటుడు విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యాడు . తెలుగులో విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’తో కోలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్‌

Dhruv Vikram : ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న విక్రమ్‌ తనయుడు?.. నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఫొటోలు..
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2022 | 10:46 AM

తమిళ విలక్షణ నటుడు విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ విక్రమ్‌ ఇప్పటికే వెండితెరకు పరిచయమయ్యాడు . తెలుగులో విజయ్‌ దేవరకొండ నటించిన అర్జున్‌ రెడ్డి రీమేక్‌ ‘ఆదిత్య వర్మ’తో కోలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధ్రువ్‌. ఇందులో  భారత సంతతికి చెందిన బ్రిటిష్ బ్యూటీ బనితా సంధు హీరోయిన్‌గా నటించింది. కాగా సిల్వర్‌ స్ర్కీన్‌పై ప్రేమికులుగా నటించి మెప్పించిన ఈ జోడీ నిజ జీవితంలోనూ ప్రేమయాణం సాగిస్తోందని ప్రచారం సాగుతుంది. వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నట్లు సోషల్‌ మీడియాతో పాటు తమిళ మీడియాల్లో వార్తలు వస్తు్న్నాయి. తాజాగా ఈ రూమర్లకు బలాన్నిస్తూ ధ్రువ్‌- బనితాలకు సంబంధించిన ఫొటోలు కొన్ని నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.

కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ జంట కలిసి దుబాయ్‌ వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ హోటల్‌ రూం బాల్కానీలో బనిత నిలబడిన ఫొటోను షేర్‌ చేస్తూ ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ శుభాకాంక్షలు తెలిపాడు ధ్రువ్‌. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ధృవ్‌, బనితలను ఇలా చూసి వారి అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీరిద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? అంటూ సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ ప్రేమికుల ఫొటోలను రీట్వీట్‌ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ‘ఆదిత్య వర్మ’ లాంటి సూపర్‌ హిట్‌ తర్వాత ధృవ్‌ నటించిన రెండవ చిత్రం ‘మహాన్‌’. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బనిత కూడా బాలీవుడ్‌ లో తన అదృష్టం పరీక్షించుకుంటోంది. గతేడాది అక్టోబర్‌లో ‘హూవీ’ తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్రిటిష్‌ బ్యూటీ.. ఆ తర్వాత విక్కీ కౌశల్‌ ‘సర్దార్ ఉద్దమ్‌’లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె ‘కవిత అండ్‌ థెరిసా’ సినిమాలో నటిస్తోంది. Also Read:

Valimai: తలాతో పోటీపడాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. వలిమై సినిమాపై కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు..

Shyam Singha Roy: సరికొత్త ప్రయోగానికి ‘శ్యామ్ సింగరాయ్’ శ్రీకారం.. ఆకట్టుకుంటోన్న నాని సినిమా కొత్త ట్రైలర్‌..

Lionel Messi: క్రీడా రంగంలో కరోనా కలకలం.. కరోనా బారిన మెస్సీ.. మరో ముగ్గురు ప్లేయర్లకు కూడా పాజిటివ్‌..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే