Shyam Singha Roy: సరికొత్త ప్రయోగానికి ‘శ్యామ్ సింగరాయ్’ శ్రీకారం.. ఆకట్టుకుంటోన్న నాని సినిమా కొత్త ట్రైలర్‌..

సాధారణంగా సినిమా విడుదలకు ముందే ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తారు. సినిమా విడుదలయ్యాక మూవీ ప్రమోషన్లలో భాగంగా కొత్త సీన్లు లేదా పాటలనో జోడిస్తుంటారు. మరికొంత మంది సినిమాలో తీసేసిన డిలీటెడ్‌ సీన్లను యూట్యూబ్‌లో విడుదల చేస్తుంటారు

Shyam Singha Roy: సరికొత్త ప్రయోగానికి 'శ్యామ్ సింగరాయ్' శ్రీకారం.. ఆకట్టుకుంటోన్న నాని సినిమా కొత్త ట్రైలర్‌..
Shyam Singha Roy
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2022 | 9:50 AM

సాధారణంగా సినిమా విడుదలకు ముందే ట్రైలర్‌ రిలీజ్‌ చేస్తారు. సినిమా విడుదలయ్యాక మూవీ ప్రమోషన్లలో భాగంగా కొత్త సీన్లు లేదా పాటలనో జోడిస్తుంటారు. మరికొంత మంది సినిమాలో తీసేసిన డిలీటెడ్‌ సీన్లను యూట్యూబ్‌లో విడుదల చేస్తుంటారు. అయితే సినిమా ప్రచారం విషయంలో ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మూవీ యూనిట్‌ వినూత్న ప్రయత్నం చేసింది. సినిమా విడుదలైన తర్వాత మరో ట్రైలర్‌ను తీసుకొచ్చి సినిమా ప్రియులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. నేచురల్ స్టార్ నాని, నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌, రాహుల్‌ రవీంద్రన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తుంది. క్రిస్మస్‌ కానుకగా విడుదలై హిట్‌టాక్‌ తో దూసుకెళ్లుతోంది.

శ్యామ్‌, రోసీల ప్రేమకథ..

కాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ‘శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్ర బృందం సినీ అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘పోస్ట్‌ రిలీజ్‌ థియేట్రికల్‌ ట్రైలర్‌’ పేరుతో ఓ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇందులో శ్యామ్‌ సింగరాయ్‌ (నాని), రోసీ (సాయి పల్లవి) మధ్య సాగే సన్నివేశాల్ని చూపించారు. ఇందులో దేవదాసి అయిన సాయి పల్లవిని నాని ఎలా కాపాడాడు? వీళ్లిద్దరి మధ్య ప్రేమ బంధం ఎలా బలపడింది? చివరకు వీళ్ల  మజిలీ ఎలా ముగిసింది ? అనేవి చక్కగా చూపించారు. ‘బ్లాక్‌ బస్టర్‌ క్లాసిక్‌’ పేరుతో విడుదల చేసిన ఈ ట్రైలర్‌ సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు 7.3 లక్షల వ్యూస్ సొంతం చేసుకుంది.మరి మీరు కూడా ఈ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.

Also Read:

Lionel Messi: క్రీడా రంగంలో కరోనా కలకలం.. కరోనా బారిన మెస్సీ.. మరో ముగ్గురు ప్లేయర్లకు కూడా పాజిటివ్‌..

Ameesha Patel: నన్ను పెళ్లి చేసుకుంటావా.. అంటూ హీరోయిన్ కు ప్రపోజ్‌ చేసిన కాంగ్రెస్‌ నేత తనయుడు.. నటి రిప్లై ఏంటంటే..

AR Rahman: వేడుకగా ఏ ఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. కాబోయే వరుడు ఎవరంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే