AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ameesha Patel: నన్ను పెళ్లి చేసుకుంటావా.. అంటూ హీరోయిన్ కు ప్రపోజ్‌ చేసిన కాంగ్రెస్‌ నేత తనయుడు.. నటి రిప్లై ఏంటంటే..

పవన్‌ కల్యాణ్‌ 'బద్రి' సినిమాలో 'సరయూ' పాత్రలో నటించి మెప్పించింది అమీషా పటేల్‌. ఆతర్వాత 'నాని', 'నరసింహుడు' చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆతర్వాత బాలీవుడ్‌కు తన మకాం మార్చేసి స్టార్‌ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. పలు హిట్‌ సినిమాలు ఖాతాలో వేసుకుంది.

Ameesha Patel: నన్ను పెళ్లి చేసుకుంటావా.. అంటూ హీరోయిన్ కు ప్రపోజ్‌ చేసిన కాంగ్రెస్‌ నేత తనయుడు.. నటి రిప్లై ఏంటంటే..
Basha Shek
|

Updated on: Jan 03, 2022 | 8:53 AM

Share

పవన్‌ కల్యాణ్‌ ‘బద్రి’ సినిమాలో ‘సరయూ’ పాత్రలో నటించి మెప్పించింది అమీషా పటేల్‌. ఆతర్వాత ‘నాని’, ‘నరసింహుడు’ చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఆతర్వాత బాలీవుడ్‌కు తన మకాం మార్చేసి స్టార్‌ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది. పలు హిట్‌ సినిమాలు ఖాతాలో వేసుకుంది. అయితే కొన్నేళ్లుగా అడపాదడపా మాత్రమే సినిమాలు చేస్తోంది. కాగా ఈ అమ్మడు కాంగ్రెస్‌ దివంగతనేత అహ్మద్‌ పటేల్‌ తనయుడు ఫైజల్‌ పటేల్‌తో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తమ ప్రేమ బంధంపై వీరిద్దరు ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఇటీవల 41వ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు ఫైజల్‌. ఈ సందర్భంగా నిర్వహించిన పార్టీకి అమీషాను కూడా ఆహ్వానించాడు.

కాగా బర్త్‌ డే పార్టీలో ఫైజల్‌తో కలిసి ఉన్న ఫొటోలను కొలేజ్‌ చేసి ‘హ్యాపీ బర్త్ డే మై డార్లింగ్.. ఐ లవ్యూ’ అంటూ అమీషా ట్విట్టర్‌ వేదికగా ప్రియుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. కానీ ఈపోస్టుకు ఫైజల్‌ మాత్రం ఆసక్తికరంగా స్పందించాడు. ‘థ్యాంక్యూ అమీషా పటేల్‌. ఈ సందర్భంగా పబ్లిక్‌గా నీకు ప్రపోజ్‌ చేస్తున్నా. నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ సోషల్‌ మీడియా వేదికగా రొమాంటిక్‌ పెళ్లి ప్రపోజల్‌ పెట్టాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ పోస్ట్‌ను వెంటనే డిలీట్‌ చేశాడు ఫైజల్‌. అయితే అప్పటికే నెటిజన్లు ఈ పోస్ట్‌కి సంబంధించిన స్క్రీన్‌ షాట్లను తీసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసేశారు కొంతమంది నెటిజన్లు. అమీషా కూడా వీటిపై స్పందించలేదు. కాగా గతంలో ఫైజల్‌ జైనాబ్‌ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే గుండెపోటుతో ఆమె 2016లో చనిపోయింది. అనంతరం ఫైజల్‌ అమీషా ప్రేమలో పడ్డాడు. కాగా ఫైజల్‌ కంటే అమీషా పటేల్‌ నాలుగేళ్లు పెద్దది కావడం గమనార్హం.

Also Read:

Sankranthi Movies: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాతో లైన్‌ క్లియర్‌..ఈ సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలివే..

AR Rahman: వేడుకగా ఏ ఆర్‌ రెహమాన్‌ కూతురి నిశ్చితార్థం.. కాబోయే వరుడు ఎవరంటే..

15 నిమిషాల్లో రూ.5.2 లక్షల కోట్లు హాంఫట్‌ !! ఎందుకిలా ?? వీడియో

Follow Us
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
రేపే క్యాబినెట్ భేటీ.. చరిత్ర సృష్టించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై
కేతన్ అగర్వాల్ మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. సియా సోదరుడిపై