Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valimai: తలాతో పోటీపడాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. వలిమై సినిమాపై కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు..

తమిళ స్టార్‌ హీరో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం 'వాలిమై'. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ హ్యుమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ ఈ చిత్రంలో అజిత్‌తో పోటాపోటీగా తలపడనున్నాడు.

Valimai: తలాతో పోటీపడాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. వలిమై సినిమాపై కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు..
Valimai
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2022 | 10:21 AM

తమిళ స్టార్‌ హీరో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘వలిమై’. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ హ్యుమా ఖురేషి హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ ఈ చిత్రంలో అజిత్‌తో పోటాపోటీగా తలపడనున్నాడు. కార్తీతో కలిసి ‘ఖాకీ’ లాంటి స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించిన హెచ్. వినోద్ ‘వాలిమై’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. . ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్‌, పోస్టర్స్ మూవీపై అంచనాలను పెంచగా, ఇటీవల విడుదలైన ట్రైలర్‌ వాటిని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇందులోని అజిత్, కార్తికేయ బైక్ స్టంట్లు సినీ అభిమానులను థ్రిల్‌కు గురిచేస్తున్నాయి. కాగా ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ‘వలిమై’ విడుదలను పురస్కరించుకుని సోషల్‌ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్‌ పోస్ట్‌ పెట్టాడు విలన్‌ కార్తికేయ. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో ఉన్న తన ఫొటోను పంచుఉకంటూ ‘సూపర్‌ స్టార్‌తో తలపడుతున్నప్పుడు నువ్వు కూడా అంతే బలంగా ఉండాలి. వాలిమై జనవరి 13న విడుదల కానుంది. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడానికి ఇంతకన్నా గొప్ప వార్త ఏముంటుంది’ అని రాసుకొచ్చాడు. కాగా, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను బోనీ కపూర్, జీ స్టూడియోస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా డబ్‌ కానుంది. యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా బాణీలు సమకూరుస్తున్నారు.

View this post on Instagram

A post shared by Kartikeya (@actorkartikeya)

Also Read:

Ameesha Patel: నన్ను పెళ్లి చేసుకుంటావా.. అంటూ హీరోయిన్ కు ప్రపోజ్‌ చేసిన కాంగ్రెస్‌ నేత తనయుడు.. నటి రిప్లై ఏంటంటే..

Shyam Singha Roy: సరికొత్త ప్రయోగానికి ‘శ్యామ్ సింగరాయ్’ శ్రీకారం.. ఆకట్టుకుంటోన్న నాని సినిమా కొత్త ట్రైలర్‌..

Sankranthi Movies: ఆర్‌ఆర్‌ఆర్‌ వాయిదాతో లైన్‌ క్లియర్‌..ఈ సంక్రాంతికి సందడి చేయనున్న సినిమాలివే..