Director PCReddy: ప్రముఖ సీనియర్‌ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..

ప్రముఖ సినీ దర్శకుడు పీసీ చంద్రశేఖర్‌రెడ్డి(86) కన్నుమూశారు. నేటి (జనవరి3) ఉదయం 8.30గంటలకు చెన్నైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కాగా పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి.

Director PCReddy: ప్రముఖ సీనియర్‌ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..
Director P C Reddy
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2022 | 11:34 AM

ప్రముఖ సినీ దర్శకుడు పీసీ చంద్రశేఖర్‌రెడ్డి(86) కన్నుమూశారు. నేటి (జనవరి3) ఉదయం 8.30గంటలకు చెన్నైలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కాగా పి.సి.రెడ్డి పూర్తి పేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి. ఆయన సుమారు 80 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు తదితర స్టార్‌ హీరోలతో సూపర్‌ హిట్‌ సినిమాలు తెరకెక్కించి మంచి గుర్తింపు సాధించారు. ఎన్టీఆర్‌తో ‘బడిపంతులు’, సూపర్‌ స్టార్‌ కృష్ణతో ‘పాడి పంటలు’ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన ఘనత పీసీ రెడ్డి సొంతం. వీటితో పాటు ‘భలే అల్లుడు’, ‘మానవుడు దానవుడు’, ‘విచిత్ర దాంపత్యం’ ‘రగిలే గుండెలు’, ‘నవోదయం’, ‘బంగారు కాపురం’, ‘రాజకీయ చదరంగం’, ‘అన్నా వదిన’, ‘పట్నవాసం’, ‘అన్నా చెల్లులు’, ‘పెద్దలు మారాలి’ తదితర హిట్‌ చిత్రాలను ఆయన తెరకెక్కించారు.

కృష్ణతో అనుబంధం.. 1933, అక్టోబర్ 15వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామంలో పందిళ్లపల్లి నారపరెడ్డి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు పీసీరెడ్డి. 1959లో అసిస్టెంట్ డైరెక్టర్ గా సినీరంగ ప్రవేశం చేశారు. వి.మధుసూధనరావు, ఆదుర్తి సుబ్బారావు వంటి దర్శక దిగ్గజాల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆతర్వాత ‘అనురాధ’ అనే సినిమాకు మొదటి సారి దర్శకత్వం వహించారు. సూపర్‌స్టార్‌ కృష్ణ, విజయనిర్మల జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. దీంతో కృష్ణ- పీసీ రెడ్డిల మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఆతర్వాత వీరి కాంబినేషన్‌లో పదుల సంఖ్యలో హిట్‌ సినిమాలు వచ్చాయి. ఇక శోభన్‌బాబుకు మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చిన ఘనత పీసీ రెడ్డిదే. అప్పటివరకు ఎక్కువగా క్లాస్‌ సినిమాల్లో నటించిన ఈ సొగ్గాడు ఆయన తెరకెక్కించిన ‘మానవుడు దానవుడు’ సినిమాతో ఒక్కసారిగా మాస్‌ హీరోగా మారిపోయారు. ఇక ఎన్టీఆర్‌తో పీసీ రెడ్డి రూపొందించిన ‘బడిపంతులు’ తెలుగు సినిమా చరిత్రలో ఒక పెద్ద ప్రయోగమేనని చెప్పవచ్చు. అప్పటివరకు రొమాంటిక్‌గా హీరోయిన్‌ల పక్కన నటిస్తోన్న ఎన్టీఆర్‌ను ఓ బడిపంతులు పాత్రలో నటింపజేసి పెద్ద సాహసానికి పూనుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌ శ్రీదేవి ఎన్టీఆర్‌ మనవరాలి పాత్రలో నటించింది. కొంత కాలం తర్వాత ఇదే శ్రీదేవి ఎన్టీఆర్‌ పక్కన హీరోయిన్‌గా నటించడం గమనార్హం. కాగా పీసీ రెడ్డి మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.   కాగా పీసీ రెడ్డి మృతికి పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Also Read:

Dhruv Vikram : ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న విక్రమ్‌ తనయుడు?.. నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఫొటోలు..

Shyam Singha Roy: సరికొత్త ప్రయోగానికి ‘శ్యామ్ సింగరాయ్’ శ్రీకారం.. ఆకట్టుకుంటోన్న నాని సినిమా కొత్త ట్రైలర్‌..

Valimai: తలాతో పోటీపడాలంటే ఆ మాత్రం ఉండాల్సిందే.. వలిమై సినిమాపై కార్తికేయ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?