Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mukku Avinash: బుల్లితెర కమెడియన్ అవినాశ్‌ ఇంటిని చూశారా? .. థీమ్‌ పోస్టర్స్‌ తో గదులను ఎంత బాగా అలంకరించారో..

బుల్లితెరపై కమెడియన్‌గా నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు ముక్కు అవినాష్‌. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇక బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

Mukku Avinash: బుల్లితెర కమెడియన్ అవినాశ్‌ ఇంటిని చూశారా? .. థీమ్‌ పోస్టర్స్‌ తో గదులను ఎంత బాగా అలంకరించారో..
Mukku Avinash And Anuja
Follow us
Basha Shek

|

Updated on: Jan 03, 2022 | 12:50 PM

బుల్లితెరపై కమెడియన్‌గా నవ్వుల పువ్వులు పూయిస్తున్నాడు ముక్కు అవినాష్‌. కొన్ని సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తున్నాడు. ఇక బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో పాల్గొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇలా బుల్లితెర, వెండితెర ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ కమెడియన్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. అనూజతో కలిసి ఏడడుగులు నడిచిన అవినాష్‌ ఇప్పుడు ఆమెతో కలిసి యూట్యూబ్‌ వీడియోలు, రీల్స్‌, ఫొటోషూట్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో తెగ సందడి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తన యూట్యూబ్‌ ఛానెల్‌ వేదికగా ‘ఇదిగో మాఇల్లు’ తన ఇంటిని కూడా అందరికీ చూపించే ప్రయత్నం చేశాడు.

ఏడేళ్ల కష్టంతో.. సుమారు అరగంటపాటు నిడివి ఉన్న ఈ వీడియోలో మొదట తాను కెరీర్‌లో నిలదొక్కుకునేందుకు తాను ఎలాంటి కష్టాలో పడ్డాడో వివరించే ప్రయత్నం చేశాడు అవినాష్‌. అనంతరం తన సతీమణితో కలిసి ట్రిపుల్‌ బెడ్‌రూమ్‌ హౌస్ విశేషాలను పంచుకున్నాడు. ‘సుమారు ఏడేళ్ల కష్టపడి వచ్చిన డబ్బుతో ఈ ఇల్లు, ఇంకా కారు కొనుక్కొన్నాను’ అని చెప్పిన అవినాష్‌ తన స్కూల్‌ఫ్రెండ్‌ జగదీశ్‌ తన ఇంటికి ఇంటీరియర్‌ డిజైన్‌ చేశాడని చెప్పుకొచ్చాడు. అనంతరం తనకు వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను చూపిస్తూ వాటి వెనక ఉన్న కథలను పంచుకున్నాడు. ఇంట్లో బాల్కనీ, వంటగది, డైనింగ్‌ టేబుల్‌, పూజ గది, బెడ్‌ రూమ్‌, అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మరో రెండ్‌ బెడ్‌రూమ్‌ విశేషాలను వివరించాడు. ‘ప్రతి మగాడు రిలాక్స్ తీసుకునేది ఎక్కువగా వాష్ రూంలోనే’ అంటూ మధ్యమధ్యలో భార్యతో కలిసి అతను వేసిన కామెడీ పంచులు బాగా పేలాయి. పుట్టబోయే పిల్లల కోసం కూడా ప్రత్యేక బెడ్‌రూమ్‌లు కేటాయించినట్లు చెప్పుకొచ్చాడీ బుల్లితెర కమెడియన్‌. కాగా ఆయా రూములు, హాల్స్‌ లోని గోడలు అందంగా కనిపించేలా అతికించిన థీమ్‌ పోస్టర్లు ప్రత్యేకాకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతూ సుమారు 10లక్షలకు పైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నెటిజన్లు. ‘మీ జంటలాగే మీ ఇల్లు కూడా అందంగా ఉంది’ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. మరి మీరు కూడా ఈ అందమైన ఇంటిపై ఓలుక్కేయండి.

Also Read:

John Abraham: బాలీవుడ్‌ను వదలని కరోనా.. వైరస్‌ బారిన స్టార్‌ హీరో దంపతులు.. జెర్సీ హీరోయిన్‌కు కూడా పాజిటివ్‌..

Dhruv Vikram : ఆ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్న విక్రమ్‌ తనయుడు?.. నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోన్న ఫొటోలు..

Director PCReddy: ప్రముఖ సీనియర్‌ దర్శకుడు పీసీ రెడ్డి కన్నుమూత.. ప్రముఖుల సంతాపం..