Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి భారీగా పట్టుబడిన హవాలా డబ్బు.. వారం రోజుల్లో 8 కోట్లు సీజ్..

హైదరాబాద్‌లో హవాలా దందా ఆగడం లేదు. వరుస పెట్టి భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. మొన్న, నిన్న మాత్రమే కాదు..

Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి భారీగా పట్టుబడిన హవాలా డబ్బు.. వారం రోజుల్లో 8 కోట్లు సీజ్..
Money
Follow us

|

Updated on: Oct 12, 2022 | 10:36 AM

హైదరాబాద్‌లో హవాలా దందా ఆగడం లేదు. వరుస పెట్టి భారీగా నగదు పట్టుబడటం కలకలం రేపుతోంది. మొన్న, నిన్న మాత్రమే కాదు.. ఇవాళ కూడా భారీ మొత్తంలో హవాలా నగదు పట్టుబడి. బంజారాహిల్స్‌లో రూ. 2 కోట్లు సీజ్‌ చేశారు అధికారులు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో టాస్స్‌ఫోర్స్ అధికారులు ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఇక నిన్న, మొన్న జూబ్లీహిల్స్ వెంకటగిరిలో రూ. 54 లక్షలు, చాంద్రాయణగుట్టలో రూ. 79 లక్షలు, జూబ్లీహిల్స్‌లో రూ. 2.5 కోట్లు పట్టుబడింది. అయితే, వారం రోజుల వ్యవధిలోనే సుమారు 8 కోట్లకు పైగా హవాలా సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకోవటం చర్చనీయాంశం అయింది. పెద్దఎత్తున తరలిస్తోన్న ఈ సొమ్ము ఎవరి ఆదేశాలతో తరలిస్తున్నారు. ఎవరికి అందజేయడానికి తీసుకెళ్తున్నారనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ప్రతీ రోజూ కోట్లలో నగదు పట్టుబడుతోంది. హవాలా వ్యాపారులు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యారో..లేక పోలీసులే కొత్తగా సోదాలు ప్రారంభించారో కానీ పెద్ద ఎత్తున నగదు హవాలా రూపంలో తరలిపోతోంది. ఇందులో దొరుకుతున్న డబ్బు మాత్రమే తెలుస్తోంది. తెలియకుండా ఎంతెంత తరలిపోతోందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు.

ఈ డబ్బంతా అక్కడికేనా?

రహస్య మార్గాల్లో తరలిపోతున్న నోట్ల కట్టలు మునుగోడుకేనా? హైదరాబాద్ హవాలా డబ్బుల వెనుక కథేంటనేది హాట్‌ టాపిక్‌ అయింది. పట్టుబడుతున్న హవాలా సొమ్ము ఏ పార్టీదంటూ చర్చ మొదలైంది. ప్రస్తుతం మునుగోడు ఉపఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికలో అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాయనే టాక్‌ కూడా నడుస్తోంది. ఈ నేపధ్యంలో పట్టుబడుతున్న నగదంతా మునుగోడుకే వెళుతుందనే వాదన వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..