AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రికి రాత్రే.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం! సీసీ టీవీ ఫుటేజ్ చూడగా..

సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు అదృశ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. దాండ్ల ఉమ, ఆమె భర్త మహేష్, ముగ్గురు పిల్లలు, ఉమ చెల్లెలు సంధ్య అదృశ్యమయ్యారు. బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కుటుంబం ఎక్కడికి వెళ్లిందనే దానిపై దర్యాప్తు జరుగుతోంది.

రాత్రికి రాత్రే.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం! సీసీ టీవీ ఫుటేజ్ చూడగా..
Family Missing
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Apr 05, 2025 | 10:58 AM

Share

ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమైన ఘటన సికింద్రాబాద్‌లోని బోయిన్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో వెలుగుచూసింది. బోయిన్‌పల్లిలోని అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఆరుగురు సభ్యుల కుటుంబం అదృశ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం రాత్రి ఆ కుటుంబ బంధువు ఒకరు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. అదృశ్యమైన వారిలో దాండ్ల ఉమ, ఆమె భర్త మహేష్, ఆరు, నాలుగు సంవత్సరాలు, తొమ్మిది నెలల వయస్సు గల వారి ముగ్గురు పిల్లలు, ఉమ చెల్లెలు సంధ్య ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి ఆ కుటుంబం ఇంటి నుంచి సామానుతో బయలుదేరి, తాము ఖాళీ చేస్తున్నట్లు ఇంటి యజమానికి తెలియజేసింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలో ఆ కుటుంబం మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వైపు వెళుతున్నట్లు కనిపిస్తోంది. వారి కదలికలను మరింత తెలుసుకోవడానికి ప్రస్తుతం ఎంజీబీఎస్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం అని బోయిన్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ లక్ష్మీ నారాయణ రెడ్డి తెలిపారు.

దినసరి కూలీ అయిన మహేష్ తన భార్య, పిల్లలతో న్యూ బోయిన్‌పల్లిలో నివసిస్తున్నాడు. ఏప్రిల్ 2న, సంధ్య వారిని చూడటానికి మేడ్చల్ నుంచి వచ్చింది. మరుసటి రోజు అంటే ఏప్రిల్ 3న ఉదయం ఇంటి యజమాని… ఉమా సోదరుడికి కుటుంబం మొత్తం రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు తొలుత తెలిసిన ప్రాంతాల్లో వెతికి, మిత్రులను వాకబు చేసి.. తెలిసిన వారితో మాట్లాడినా ఆచూకి లభించకపోవడంతో, పోలీసులను సంప్రదించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. కుటుంబం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మహేశ్​ బోయిన్​పల్లిలో వాటర్ సప్లై యూనిట్‌లో ఆపరేటర్​గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ