Hyderabad: మరిదిపై హత్యాయత్నం.. భార్యకు అండగా భర్త.. చివరకు ఆ మ్యాటర్ తెలియడంతో ఇప్పుడు భర్తే ఆమెను..

సొంత తమ్ముడిపైనే హత్యాయత్నం చేసిన భార్యను కాపాడిన భార్య.. చివరకు తానే ఆమె హతమార్చాడు. హైదరాబాద్‌లోని గౌలిగూడలో..

Hyderabad: మరిదిపై హత్యాయత్నం.. భార్యకు అండగా భర్త.. చివరకు ఆ మ్యాటర్ తెలియడంతో ఇప్పుడు భర్తే ఆమెను..
Arrest
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2022 | 10:00 AM

సొంత తమ్ముడిపైనే హత్యాయత్నం చేసిన భార్యను కాపాడిన భార్య.. చివరకు తానే ఆమె హతమార్చాడు. హైదరాబాద్‌లోని గౌలిగూడలో చోటు చేసుకున్న ఘటన భాగ్యనగరంలో కలకలం సృష్టించింది. భార్యను హతమార్చిన భర్త.. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మహిళ హత్యకు భర్త సోదరుడితో సాగించిన అక్రమ సంబంధమే కారణం అని తేలింది. ఈ హత్య వెనుక మ్యాటర్ చాలానే ఉంది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నిందితుడు పి.రామకృష్ణ తన భార్య పి. అరుణ (21)ను హత్య చేశాడు. పోలీస్ స్టేషన్‌కు వచ్చి, భార్యను చంపిన ప్రాంతానికి పోలీసులను తీసుకెళ్లాడు. తన భార్యను గొంతునులిమి చంపినట్లు రామకృష్ణ పోలీసులకు తెలిపారు. తన భార్య, తన సోదరుడితో అక్రమ సంబంధం పెట్టుకుందని, ఇదే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ఆ క్రమంలోనే కండువా, చీరతో గొంతు నులిమి చంపినట్లు రామకృష్ణ పోలీసులకు వివరించాడు. అలా భార్యను చంపిన రామకృష్ణ, తన ఏడాది వయసున్న కొడుకుని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

అయితే, రాజేందర్‌నగర్‌లోని ఓ లాడ్జిలో నెల రోజుల క్రితం రామకృష్ణ సోదరుడిని అరుణ హత్య చేసేందుకు ప్రయత్నించింది. ఇదే అంశంలో అరుణపై కేసు నమోదు చేశారు. అయితే, అరుణ అప్పటి నుంచి తప్పించుకుని తిరుగుతోంది. పోలీసుల నుంచి తన భార్యను రక్షించుకునేందుకు రామకృష్ణ ఆమెను దాస్తూ వచ్చాడు. రామకృష్ణ సాయంతోనే అరుణ పోలీసులకు చిక్కకుండా లాడ్జీలు, హోటళ్లలో తలదాచుకుంటూ ఉంది. అయితే, రాజేంద్రనగర్ కేసులో రామకృష్ణ సోదరుడితో అరుణకు అక్రమ సంబంధం ఉందని వెలుగు చూసింది. ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ.. నేరుగా తన భార్య అరుణ వద్దకు వెళ్లి నిలదీశాడు. ఇదే విషయంలో ఘర్షణపడి ఆమెను హతమార్చాడు రామకృష్ణ. పోలీసులు రామకృష్ణపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..