AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode Bypoll: మునుగోడుపై కాంగ్రెస్‌ స్పెషల్‌ ఫోకస్‌.. రాహుల్ జోడో యాత్ర మార్పుచేర్పులపై రూట్‌మ్యాప్‌ రెడీ చేయనున్న టీపీసీసీ నేతలు

రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుండడం ఆ పార్టీలో మరింత జోష్‌ నింపుతోంది. మరి మునుగోడులో రాహుల్‌ టూర్‌..

Munugode Bypoll: మునుగోడుపై కాంగ్రెస్‌ స్పెషల్‌ ఫోకస్‌.. రాహుల్ జోడో యాత్ర మార్పుచేర్పులపై రూట్‌మ్యాప్‌ రెడీ చేయనున్న టీపీసీసీ నేతలు
Rahul Gandhi and Revanth Reddy
Sanjay Kasula
|

Updated on: Oct 04, 2022 | 10:22 AM

Share

తెలంగాణ నేలపై రాజకీయ వేడి రాజుకుంటోంది. మునుగోడు వార్‌ పొలిటికల్‌ హీట్‌ పెంచుతోంది. ఉప ఎన్నికను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్‌ నేతలు.. మునుగోడుపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు. ఇదే సమయంలో రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇస్తుండడం ఆ పార్టీలో మరింత జోష్‌ నింపుతోంది. మరి మునుగోడులో రాహుల్‌ టూర్‌ ఉంటుందా..? పార్టీ స్టాండ్‌ ఏంటన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మునుగోడు యుద్ధానికి తెరలేచింది. అటు టీఆర్‌ఎస్‌.. ఇటు బీజేపీ నువ్వానేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. కాంగ్రెస్‌ సైతం సమరానికి సై అంటోంది. ఇప్పటికే రాహుల్‌ భారత్‌ జోడో యాత్రతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. ఇదే సమరోత్సాహంతో మునుగోడు యుద్ధానికి రెడీ అవుతోంది కాంగ్రెస్‌.

తెలంగాణలో 13 రోజుల పాటు సాగనుంది రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర. అక్టోబర్‌ 24న తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనుంది. ఇప్పటికే షెడ్యూల్‌ సైతం రిలీజైంది. ఓవైపు రాహుల్‌ యాత్ర.. మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం ఒకే సమయంలో ఉండబోతున్నాయి. మరి రాహుల్‌ మునుగోడు వెళ్తారా..? అక్కడ జోడో యాత్ర చేపడతారా అన్నది ఆసక్తిగా మారింది. రాహుల్‌ మునుగోడు వస్తే మరింత లాభిస్తుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఉప ఎన్నికలో రాహుల్‌తో కీలక ప్రకటన చేయించాలని నేతలు భావిస్తున్నారు.

రాహుల్‌ను ఎలాగైనా మునుగోడు తీసుకెళ్లాలన్న పట్టుదలతో టీ కాంగ్రెస్‌ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మునుగోడులో గెలిచి తీరాలన్న కసితో ఆ పార్టీ నాయకత్వం పనిచేస్తోంది. ఇందుకోసం రాహుల్‌ మేనియాను వాడుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగానే నేడు టీ కాంగ్రెస్‌ కీలక నేతలు భేటీ అవుతున్నారు. జోడో యాత్ర ఏర్పాట్లు, రూట్‌ మ్యాప్‌పై చర్చించనున్నారు. రూట్‌ మ్యాప్‌లో మార్పులపై చర్చించే అవకాశముంది. కొత్తగా మునుగోడుకు స్థానం కల్పించే చాన్సుంది. అక్టోబర్ 24న తెలంగాణలో ప్రవేశించనున్న రాహుల్ పాదయాత్ర రాష్ట్రంలో 13 రోజుల పాటు జరగనుంది. తెలంగాణలో 359 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ.

ఇక మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న పోలింగ్‌, 6న కౌంటింగ్‌ ఉంటుంది. ఈ నెల7న మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల చేసింది. నామినేషన్ల దాఖలుకు చివరితేదీ ఆక్టోబర్‌ 14 అని నిర్ణయించారు. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్నది. 15న నామినేషన్లను పరిశీలించనుండగా.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం