TSRTC: ఇకపై ఆర్టీసీ బ్రాండ్ వాటర్ బాటిళ్లు.. ఆ బస్సుల్లో ప్రయాణించే వారికి ఉచితంగానే..

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తూ ఆక్యుపెన్సీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా విజృంభించినప్పటి..

TSRTC: ఇకపై ఆర్టీసీ బ్రాండ్ వాటర్ బాటిళ్లు.. ఆ బస్సుల్లో ప్రయాణించే వారికి ఉచితంగానే..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2022 | 9:58 AM

నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ని లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రత్యేక ఆఫర్లు, రాయితీలు ప్రకటిస్తూ ఆక్యుపెన్సీ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా విజృంభించినప్పటి నుంచి ఈ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణ ఆర్టీసీని గాడిన పెట్టేందుకు యాజమాన్యం ముప్పుతిప్పలు పడుతోంది. అదనపు ఆదాయాన్ని తీసుకువచ్చే మార్గాలపై దృష్టి సారించింది. అయినా ఆర్టీసీ ఆదాయం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు చేపడుతోంది. అందులో భాగంగానే ఆర్టీసీ బ్రాండ్ వాటర్ బాటిల్స్. ఇప్పటికే పెట్రోల్‌ బంకులను నిర్వహిస్తున్న తెలంగాణ ఆర్టీసీ.. మంచినీటి సీసాల (వాటర్‌ బాటిళ్లు) విక్రయానికీ రంగం సిద్ధం చేసింది. మంచినీటి వ్యాపారాన్ని ప్రారంభించేందుకు గత వారంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో ఆమోదం లభించింది. అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో ప్రముఖ కంపెనీల ద్వారా వాటర్ బాటిళ్లు తయారు చేయించాలని నిర్ణయించింది. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు ఉచితంగా వాటర్‌ బాటిళ్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మీదట సొంత బ్రాండ్‌ నీటినే ఇచ్చేందుకు నిర్ణయించింది.

కాగా.. గతంలోనే బస్టాండ్‌ ఆవరణలో తాగునీటి వాటర్ బాటిల్స్ అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ ప్రకటన చేశారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో తీసుకొచ్చే వాటర్ బాటిల్ డిజైన్, ఒక బ్రాండ్ పేరును సూచించాలని ప్రయాణికులను కోరారు. మంచి పేరు, డిజైన్ సూచించిన వారికి రివార్డులు కూడా ఇస్తామని ప్రకటించారు. బయటి కంపెనీలు కాకుండా శుభ్రమైన తాగునీటిని అందించే సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని, ఆర్టీసీ బ్రాండింగ్‌తో నీటి సౌకర్యాన్ని కల్పించాలని భావిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
తక్కువ ధరలో మంచి బ్యాటరీ ఫోన్‌ కోసం చూస్తున్నారా.?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?