Hyderabad: మగువ మాయలో 9ఏళ్ల కుర్రాడు.. ఆమె నుంచి కాపాడండి అంటూ తల్లిదండ్రుల ఆవేదన!

Hyderabad: బుద్ధిగా చదువుకుని తల్లిదండ్రులకు ఆసరగా ఉండాల్సిన కొడుకు.. మగువ మాయలో పడి కనిపించకుండాపోయాడు.

Hyderabad: మగువ మాయలో 9ఏళ్ల కుర్రాడు.. ఆమె నుంచి కాపాడండి అంటూ తల్లిదండ్రుల ఆవేదన!
Hrc
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 13, 2022 | 10:04 AM

Hyderabad: బుద్ధిగా చదువుకుని తల్లిదండ్రులకు ఆసరగా ఉండాల్సిన కొడుకు.. మగువ మాయలో పడి కనిపించకుండాపోయాడు. తల్లిదండ్రులు కాదు.. తానే కావాలంటూ మాయమైపోయాడు. 30 ఏళ్ల మహిళ కోసం.. 19 ఏళ్లు కంటికి రెప్పలా చూసుకున్న తమనే కాదనడంతో ఆ తల్లిదండ్రుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. ఇక చేసేదేం లేక.. ఆ పేరెంట్స్ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. ఓ మహిళ వలలో చిక్కుకున్న తన కుమారుడిని కాపాడాలంటూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్ మహానగరంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలికి చెందిన ప్రైవేటు అధ్యాపకుడికి 19 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతను ఓ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే, ఆ యువకుడికి స్థానికంగా ఉండే 30 ఏళ్ల మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దాంతో అప్పటి నుంచి అతను ఇంట్లో సరిగా ఉండేవాడు కాదు. ఈ క్రమంలో తాజాగా జూన్ 26వ తేదీన ఇంటి నుంచి వెళ్లిన ఆ యువకుడు.. ఇప్పటికీ తిరిగి రాలేదు. ఆ మహిళ వద్దే ఉంటున్నట్లు యువకుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో తమ కొడుకుని ఆమె కొంగుకు కట్టేసుకుందని, పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు యువకుడు తల్లిదండ్రులు. అయితే, అబ్బాయి మేజర్ కావడంతో తామేమీ చేయలేమని చేతులెత్తేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో వారు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమ కుమారుడిని ఓ మహిళ వలలో వేసుకుందని, ఆమె చెర నుంచి అతడిని కాపాడాలంటూ మానవ హక్కుల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..