Telangana: మంచి నూనెగా భావించి పురుగుల మందుతో వంట.. భార్య మృతి, భర్త పరిస్థితి సీరియస్..

Telangana: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని మహిళ పురుగుల మందునే మంచినూనెగా భ్రమించింది.

Telangana: మంచి నూనెగా భావించి పురుగుల మందుతో వంట.. భార్య మృతి, భర్త పరిస్థితి సీరియస్..
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 13, 2022 | 10:05 AM

Telangana: ఖమ్మం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని మహిళ పురుగుల మందునే మంచినూనెగా భ్రమించింది. దానితో వండిన కూరను తాను తినటమే కాక భర్తకు, కుమార్తెకు సైతం వడ్డించింది. ఈ క్రమంలో ఆమె మృత్యువాత పడింది. భర్త ఆసుపత్రిలో కొన ఉపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సంఘటనపై తిరుమలాయపాలెం పోలీసు స్టేషన్ పరిథిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మేడిదపల్లికి చెందిన బండ్ల నాగమ్మ మానసికస్థితి సరిగాలేక ఇబ్బందిపడుతోంది. ఇంట్లో మంచినూనెకు బదులుగా పక్కనున్న పురుగుమందుతో కూర వండింది. అనంతరం కూరతో తాను అన్నం తిని, చేలో పనిచేస్తున్న భర్త పుల్లయ్య, కూతురు పల్లవిలకు తీసుకెళ్లింది. మద్యం మత్తులో ఉన్న పుల్లయ్య కొంతమేర ఆ అన్నాన్ని తిన్నాడు. మందువాసన రావటంతో కుమార్తె అన్నాన్ని పడేసింది. నాగమ్మ అపస్మాకరస్థితిలోకి వెళ్లింది. ఇది గమనించిన స్థానికులు ఇద్దరిని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగమ్మ మృతిచెందింది. పుల్లయ్యకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే