Telangana: 10 ఏళ్ల క్రితం ప్రియుడితో లేచిపోయిన భార్య తాజాగా ఊర్లోకి వచ్చి కాపురం పెట్టింది.. ఆ తర్వాత

అన్యోన్య దాంపత్యంలో నిప్పులు కురిపిస్తున్నాయి వివాహేతర సంబంధాలు..పెళ్లి అనే బంధంతో పాటు, ఏడడుగుల అనుబంధాన్ని వెక్కిరి స్తున్నాయి..సహజీవన సంఘటనల ఫలితంగా ప్రాణాలు కోల్పోవడమే కాకుండా, తమ కుటుంబ పరువుని,కుటుంబ సభ్యులని అనాధలుగా మారుస్తున్నాయి..

Telangana: 10 ఏళ్ల క్రితం ప్రియుడితో లేచిపోయిన భార్య తాజాగా ఊర్లోకి వచ్చి కాపురం పెట్టింది.. ఆ తర్వాత
Women(representative image)
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 26, 2022 | 8:36 PM

Siddipet district: సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం(Bejjanki Mandal) వీరాపురం(Veerapuram)లో బతుకమ్మ పండుగ తొలిపొద్దే విషాదం చోటుచేసుకుంది. అంతా బతుకమ్మ ఆటా పాటాల్లో ఆనందంగా వున్న టైమ్‌లో ఎల్లారెడ్డి అనే వ్యక్తి స్వప్నపై దాడి చేశాడు. జనం తేరుకునేలో అతను పరారయ్యాడు. స్వప్న స్పాట్‌లో మృతిచెందింది.  ఎల్లారెడ్డి ఎవరో కాదు. స్వప్న భర్త. వాళ్లకు ఇద్దరు పిల్లలు. అంతకు ముందు స్వప్న అక్కయ్యను ఎల్లారెడ్డి పెళ్లి చేసుకున్నాడు. కారణాలేంటో ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆతరువాత స్వప్నను రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదట్లో బాగానే ఉండేవాళ్లు. ఆ తరువాత కథ మరో టర్న్‌ తీసుకుంది. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్వప్న చనువుగా ఉండడంతో కాపురంలో కలతలు మొదలయ్యాయి. బంధం బరిదాటనే దాటింది. భర్తను పిల్లలను కాదనుకొని ఆమె ప్రియుడి వెంట పల్లె పొలిమేర దాటింది. ఇద్దరు పట్నం బాటపట్టారు. నెలలు ఏడాది కాదు.. పదేళ్లుగా వాళ్లద్దరి సహజీవనం కొనసాగింది. ఎల్లారెడ్డి మళ్లీ పెళ్లి చేసుకోలేదు. పిల్లల్నిచూసుకుంటూ తనంతట తానున్నాడు. ఇదే క్రమంలో స్వప్న ఊళ్లోకి రావడం. ఎల్లారెడ్డి కంటపడింది.. పైగా వాళ్లు తమ వీధిలోనే ఉండడం.. చూసి మానిందనుకున్న గాయం మళ్లీ తిరగపెట్టింది.  తలో తీరుగా మాట్లాడుకోవడం చెవిన పడిందో.. ఎవరెవరో ఏదేదో అనుకుంటారనే అనుమానమో .. కానీ ఎల్లారెడ్డి ఊళ్లో ఎన్నడూ లేని కలకలం రేపాడు. ఊళ్లో అందరికీ తెలిసిన విషయమే. ఎవరి దారి వాళ్లదనుకన్నాక ఇక ఏ గొడవలుంటాయనకుంది స్వప్న. అందరిలా ముస్తాబై బతుకమ్మ ఆడటానికి వెళ్లింది. అంతే అప్పటికే పక్కా స్కెచ్‌తో రెడీ గావున్న ఎల్లారెడ్డి.. ఒక్కసారిగా ఆమెపై అటాక్‌ చేశాడు. జనం తేరుకునేలోపే పారిపోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో స్వప్ప స్పాట్‌లో చనిపోయింది. అనూహ్యమైన ఈ ఘటనతో వీరాపురం ఉలిక్కిపడింది

తన ఇద్దరు బిడ్డలను పొట్టన పెట్టుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు స్వప్న పేరెంట్స్‌. అతన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బరి దాటిన బంధం… భరించలేని భర్త.. పండుగ పూట బతుకమ్మ సాక్షిగా దారుణ హత్య… ఇది ముమ్మాటికే నేరమే. వివాహేత‌ర సంబంధాలు, ప‌చ్చ‌ని సంసారాల్లో చిచ్చు రేపుతోన్న వైనానికి ఇది మరో నెత్తుటి నిదర్శనం . పెద్దల పంతాలకు ..తప్పులకు చిన్నారులు అనాథలవుతున్నారు. కట్టుకున్నవాడే స్వప్నను కడతేర్చాడు. చేసిన నేరానికి వీరారెడ్డికి చట్టప్రకారం శిక్ష తప్పదు. పెద్దలకు చేసిన తప్పులకు చిన్నారులకెందుకు శిక్ష.. వాళ్ల భవితకు ఆదరువు కరువయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..