Road Accident: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం..
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆగిఉన్న ఆటోతో పాటు బైక్ను డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి కారణమైన డిసిఎం వాహనం దగ్ధం అయింది.
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా.. ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఆగిఉన్న ఆటోతో పాటు బైక్ను డీసీఎం వాహనం ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నట్లు ప్రాథమికంగా తెలిసింది. మృతులు మోతి ఘనపూర్ వాసులుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై స్థానికుల ఆందోళన చేపట్టారు. డీసీఎం అద్దాలు ధ్వంసం చేశారు. అలాగే వాహనం మొత్తాన్ని నిప్పంటించి తగులబెట్టారు.
తండాల నుంచి గిరిజనులు మండల కేంద్రమైన బాలనగర్‌లో జరిగే వారపు సంతకు వచ్చారు. కూరగాయలు, ఇతర వస్తువులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు బాలానగర్ మండలంలోని మేడిగడ్డ తండా, నందారం, బీబీనగర్ తండా వాసులుగా గుర్తించారు. జాతీయ రహదారి 44పై బైఠాయించి నిరసన చేస్తున్నారు. ఈ ప్రమాదంతో కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఈ ప్రమాదంపై పోలీసులు రంగంలోకి దిగి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. తప్పు ఎవరిది.. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ముందు ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తు్న్నారు. ప్రమాదం జరిగిన వెంటనే గాయాలపాలైన బాధితులను ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..