Telangana Congress: ఆ ఎన్నికలపై కాంగ్రెస్ నజర్.. రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్ ఇదే..
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎక్కువ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎక్కువ స్థానాలను దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వంపై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఒకపక్క ఇచ్చిన హామీలు నెరవేర్చడం, మరోపక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని గుప్పిట్లోకి తెచ్చుకోవడం వంటి పెద్ద సమస్యలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందున్నప్పటికీ.. వాటిని అధిగమించేందుకు తన మార్క్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ రెండు కాకుండా మరో తీవ్రమైన సవాల్ రేవంత్ రెడ్డి ముందు ఉంది. అదే రాబోతున్న పార్లమెంట్ ఎలక్షన్స్.. పిసిసి అధ్యక్షుడిగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని విజయపథంలోకి తీసుకువెళ్లిన విషయంలో రేవంత్ పాత్ర కీలకమైంది. ఇప్పుడు పార్లమెంటు ఎలక్షన్స్ వరకు పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొనసాగుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. ఒకపక్క పార్టీ అధ్యక్షుడుగా మరోపక్క ముఖ్యమంత్రి హోదాలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించడం ఇప్పుడు రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్..
ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భువనగిరి, నల్గొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, పెదపల్లి పార్లిమెంట్ పరిధిలో ఎమ్మెల్యేలు ఏకపక్షంగా గెలవడంతో ఇక్కడ పార్లమెంట్ స్థానాలు గెలిచే సూచనలు పార్టీకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే, ఉత్తర తెలంగాణ జిల్లాలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, జహీరాబాద్, మెదక్, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ చేవెళ్లలో పార్టీ కాస్త బలహీనంగా ఉంది.. కాస్త కష్టపడితే ఇక్కడ కొన్ని స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తోంది. దీంతో కొంచెం కష్టపడితే గెలిచే అవకాశం ఉన్న స్థానాల్లో గట్టిగా పని చేస్తూ ఎక్కువ స్థానాల్లో గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సంక్రాంతి తర్వాత సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వెళ్లనున్నారు. తర్వాత పూర్తిస్థాయిలో పార్లమెంట్ ఎన్నికలపైన దృష్టి పెట్టబోతున్నారు. 17 స్థానాల్లో కనీసం 15 స్థానాలు అయినా గెలిచే విధంగా కార్యాచరణను రూపొందించబోతున్నారు.
అయితే పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల కోసం ఇప్పటికే అన్వేషణ మొదలైనట్టుగా తెలుస్తోంది. కొంతమంది ప్రతిపాద పేర్లతోటి పార్లమెంటు ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలకు చేయించినట్టుగానే సర్వే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సునీల్ కొనుగోలు టీం అసెంబ్లీ ఎలక్షన్స్ పనిచేసిన విధంగానే యదార్థంగా పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇక్కడ పని చేయబోతున్నట్లు తెలుస్తోంది. బలమైన అభ్యర్థులు లేని చోట ఇతర పార్టీల నుంచి అభ్యర్థులను తీసుకొని బరిలో దింపాలని ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..