Telangana: ప్రజాభవన్‎లో ఫిర్యాదుల వెల్లువ.. అన్ని దరఖాస్తులు దీనిపైనే..

హైదరాబాద్‌లో ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణిలో భూవివాదాలకు సంబంధించి అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై బాధితులు కంప్లైంట్స్‌ చేస్తుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. హైదరాబాద్ ప్రజాభవన్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది.

Telangana: ప్రజాభవన్‎లో ఫిర్యాదుల వెల్లువ.. అన్ని దరఖాస్తులు దీనిపైనే..
Prajavani
Follow us
Srikar T

|

Updated on: Jan 05, 2024 | 8:59 PM

హైదరాబాద్‌లో ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రజావాణిలో భూవివాదాలకు సంబంధించి అంశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై బాధితులు కంప్లైంట్స్‌ చేస్తుండడం హాట్‌టాపిక్‌గా మారుతోంది. హైదరాబాద్ ప్రజాభవన్‌లో ప్రతి మంగళవారం, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజావాణిలో తమ సమస్యలు చెప్పుకోవడానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు, బాధితులు తరలి వస్తున్నారు. అయితే.. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ప్రజావాణికి డబుల్ బెడ్ రూమ్ కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య తగ్గింది. కానీ.. భూకబ్జాలపై ఫిర్యాదులు మాత్రం వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అందులోనూ రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులే భూ కబ్జాలకు పాల్పడినట్లు క్లంప్లైంట్స్‌తో ప్రజావాణికి క్యూకడుతున్నారు బాధితులు.

ఎప్పటిలాగానే.. ప్రతి వారం వచ్చినట్లే పలువురు భూకబ్జా బాధితులు ప్రజాభవన్‌కు తరలివచ్చారు. ఈ సారి ఏకంగా.. మంచిర్యాల కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, మాజీ మంత్రి మల్లారెడ్డిపై పలువురు బాధితులు భూకబ్జా ఆరోపణలు చేశారు. ప్రేమ్‌సాగర్‌రావు, మల్లారెడ్డి.. తమ భూములను కబ్జా చేశారంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు బాధితులు. పెద్దయెత్తున ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రజాభవన్‌ ముందు ఆయా నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇక.. పటాన్‌చెరు పరిధిలో 1300 మందికి సంబంధించిన 200 ఎకరాలపై గత ప్రభుత్వ పెద్దలు కన్నేశారని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు కొందరు స్థానికులు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే బీసీల్లోంచి 26 కులాలను ప్రభుత్వం తీసి వేసిందని ఆయా కుల సంఘాల నేతలు ఫిర్యాదు చేశారు. అటు.. 317 జీవో కారణంగా తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు ఉపాధ్యాయులు ప్రజావాణిలో అధికారులకు మొర పెట్టుకున్నారు. మొత్తంగా.. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు.. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..