Yadadri: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. గణనీయంగా పెరిగిన స్వామివారి ఆదాయం..

ఆలయ ఉద్ఘాటన జరిగి ఏడాదిన్నర కావస్తోంది. అప్పటి నుంచి ఆలయానికి భక్తుల ఆదరణ పెరిగింది. గతంలో రోజుకు 10 వేలు, సెలవు దినాల్లో 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వారు. ప్రస్తుతం ప్రతి రోజు 20 వేల నుంచి 30 వేల మంది భక్తులు వస్తుండగా, ఆదివారం, సెలవు దినాల్లో 75 వేలమంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. గతంలో కేవలం తెలంగాణ నుండే భక్తులు రాగా, ఇప్పుడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. ఉద్ఘాటన జరిగిన ఏడాదిలో కోటిన్నర మంది భక్తులు దర్శించుకున్నారు.

Yadadri: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. గణనీయంగా పెరిగిన స్వామివారి ఆదాయం..
Lakshmi Narasimha Swamy Temple
Follow us
M Revan Reddy

| Edited By: Shiva Prajapati

Updated on: Aug 13, 2023 | 10:08 AM

Yadadri Lakshmi Narasimha Swamy Temple: ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. ఆలయ ఉద్ఘాటన తర్వాత స్వామివారి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. ఏక శిఖర వాసుడు.. యాదగీరిశుడి ఆదాయం గురించి తెలుసుకుందాం..

తెలంగాణ ప్రజల ఇలవేల్పుగా ఉన్న సంభోద్భవుడు.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సీఎం కేసీఆర్ 1200 కోట్ల రూపాయలతో పునర్ నిర్మించారు. ఐదేళ్ల పాటు శ్రమించి ఆలయాన్ని కృష్ణ శిలలతో సర్వాంగ సుందరంగా నిర్మించారు.దీంతో యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకుంది. స్వయంభూ లక్ష్మీ నరసింహుడి ఆలయాన్ని గత ఏడాది మార్చి 28న సీఎం కేసీఆర్ దంపతుల చేతుల మీదుగా మహాకుంభ సంప్రోక్షణతో ఉద్ఘాటన జరిగింది.

ఆలయ ఉద్ఘాటన జరిగి ఏడాదిన్నర కావస్తోంది. అప్పటి నుంచి ఆలయానికి భక్తుల ఆదరణ పెరిగింది. గతంలో రోజుకు 10 వేలు, సెలవు దినాల్లో 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే వారు. ప్రస్తుతం ప్రతి రోజు 20 వేల నుంచి 30 వేల మంది భక్తులు వస్తుండగా, ఆదివారం, సెలవు దినాల్లో 75 వేలమంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు. గతంలో కేవలం తెలంగాణ నుండే భక్తులు రాగా, ఇప్పుడు దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. ఉద్ఘాటన జరిగిన ఏడాదిలో కోటిన్నర మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తులు మొక్కులు చెల్లించుకొని కానుకలు సమర్పిస్తుండడంతో స్వామి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.

ఆలయ ఉద్ఘాటన తర్వాత అనేక రవాణా, వసతి సౌకర్యాల కల్పనతో భక్తుల రద్దీతో పాటు స్వామివారి ఆదాయం కూడా అదే స్థాయిలో పెరిగింది. దీంతో 2022– 23లో ఆలయ వార్షిక ఆదాయం రూ.193 కోట్ల 63 లక్షలకు చేరుకుంది. 2014లో రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆలయ వార్షిక ఆదాయం రూ.61 కోట్లు ఉండగా.. ప్రస్తుతం మూడు రెట్లు పెరిగింది. టికెట్లు, నిత్య పూజలు, లడ్డూలు, కల్యాణోత్సవాలు, హుండీ సేకరణ, విరాళాలు, ఫిక్స్ డ్ డిపాజిట్లు ద్వారా రోజువారీ ఆలయం ఆదాయం గణనీయంగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నెలలో రూ.11,53,61,580 కోట్లు, మే నెలలో రూ. 21,87,08,58 కోట్లు, జూన్ నెలలో రూ. 16,36,04,962 కోట్లు, జూలై నెలలో రూ. 13,96,63,611 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడాది నవంబర్ 14న యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయిలో రూ.1.09 కోట్ల ఆదాయం సమకూరింది.

తమ ఇలవేల్పుగా ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కోరిన కోర్కెలు నెరవేరిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడానికి యాదాద్రికి వస్తున్నామని భక్తులు చెబుతున్నారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత యాదాద్రి కొండపై భక్తి భావం ఉట్టిపడుతోందని, స్వామి వారి దర్శనానికి ఏడాదిలో రెండు మూడు సార్లు వస్తున్నామని చెబుతున్నారు. ఉద్ఘాటన తర్వాత ఆలయానికి భక్తులకు తాకిడి పెరిగిందని.. దీంతో ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతోందని ఆలయ అధికారులు చెబుతున్నారు. కొండ కింద టెంపుల్ సిటీ పూర్తితోపాటు భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రణాళికను అమలు చేస్తున్నామని ఆలే అధికారులు చెబుతున్నారు. దీంతో భక్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తద్వారా ఆదాయం కూడా పెరుగుతుందని ఆలయ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..