Blast in Hyderabad: హైదరాబాద్‌లో భారీ పేలుడు.. కెమికల్ డబ్బాను కట్ చేస్తుండగా..

Blast in Hyderabad: హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది.

Blast in Hyderabad: హైదరాబాద్‌లో భారీ పేలుడు.. కెమికల్ డబ్బాను కట్ చేస్తుండగా..
Bomb Blast
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 18, 2021 | 4:12 PM

Blast in Hyderabad: హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి సుభాష్ నగర్‌లోని ఓ ప్లాస్టిక్ గోడౌన్‌లో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ డబ్బాని కట్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ పేలుడు ధాటికి ప్లాస్టిక్ గోడౌన్ కుప్పకూలిపోయింది. గోడలు విరిగిపడ్డాయి. ప్రమాదంపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్లాస్టిక్ స్క్రాప్‌ను మిషన్‌లో వేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తిరిగి ప్లాస్టిక్ వస్తువుల తయారీకి రా మెటిరియల్‌ను వినియోగిస్తారు. ఈ క్రమంలోనే గోడౌన్‌లో పాత ప్లాస్టిక్ డబ్బా ఒకటి మూత తీయకుండా మిషన్‌లో వేయడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పాత ప్లాస్టిక్ డబ్బాలు సేకరించే క్రమంలో డబ్బాలు మూతలు తీయకపోవడం, ఆ ప్లాస్టిక్ డబ్బాలో రసాయనాలు ఉండటంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అంతా భావిస్తున్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంలో పాత స్క్రాప్ ఏరుకునే వ్యక్తి.. ప్లాస్టిక్ డబ్బా మూత తీయబోగా పేలుడు సంభవించింది తీవ్ర గాయాలపాలయ్యాడు. తాజాగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ప్రమాదంపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పాత డబ్బాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్వాహకులను సూచించారు.

Also read:

Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్

Assembly Elections 2022: 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ కసరత్తు.. జనవరిలో షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్!

MLA RK Roja Comments: రాజధాని రైతుల సభపై ఎమ్మెల్యే ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో