Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: ఆ రూల్‌తోనే ఉద్యోగుల విభజన.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు

CM KCR key orders: నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు

CM KCR: ఆ రూల్‌తోనే ఉద్యోగుల విభజన.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 18, 2021 | 5:09 PM

CM KCR key orders: నూతన జోనల్ వ్యవస్థ నియమ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజనను చేపట్టాలని సీఎం కేసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన ఉండాలన్నారు. నూతన జోనల్ వ్యవస్థతో ఇది అమలులోకి వస్తుందని సీఎం కెసీఆర్ స్పష్టంచేశారు. వెనకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయ గలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. భార్యాభర్తల ఉద్యోగులు (స్పౌస్ కేస్) ఒకే చోట పనిచేస్తెనే వారు ప్రశాంతంగా పనిచేయగలుగుతారని,ఉత్పాదకత కూడా పెరుగుతుందని సీఎం తెలిపారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పోస్ కేస్ అంశాలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రులు, సీఎస్, కలెక్టర్ల సమావేశంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతోపాటు దళితబంధు, ధాన్యం సేకరణ, యాసంగి పంటల మార్పిడిపై కలెక్టర్లకు పలు సూచనలు చేశారు.

కలెక్టర్లతో జరుగుతున్న మీటింగ్‌లో సీఎం కేసీఆర్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. యాసంగిలో కిలో వడ్లు కూడా కొనే పరిస్థితి లేదన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాల నుంచి రాష్ట్ర రైతుల్ని కాపాడాలని కలెక్టర్లకు సూచించారు. క్షేత్రస్థాయికి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే రాబోయే వానాకాలం పంటల సాగుపై ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వ్యవసాయ అధికారులకు చెప్పారు. ప్రధానంగా పత్తి, వరి, కంది సాగు పై దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ లాభసాటి పంటల సాగు దిశగా రైతులను సమాయత్తం చేయాలన్నారు.

త్వరలోనే దళితబంధు.. తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా చేయడమే దళిత బంధు పథకం లక్ష్యమని కేసీఆర్ చెప్పారు.10 లక్షల సాయం, దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తుందన్నారు. దళితబంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలో ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం, ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళిత బంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.

Also Read:

CM KCR: కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభం.. దళితబంధు, ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు..!

Pawan Kalyan: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించిన జనసేనాని.. 3రోజులపాటు సాగనున్న క్యాంపెయిన్..