AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR: కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభం.. దళితబంధు, ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు..!

CM KCR - Collectors Conference: హైదరాబాద్‌లోని ప్రగతి భ‌వ‌న్‌లో జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశం ప్రారంభమైంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం

CM KCR: కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభం.. దళితబంధు, ధాన్యం కొనుగోళ్లపై కీలక ఆదేశాలు..!
Cm Kcr
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 18, 2021 | 4:02 PM

CM KCR – Collectors Conference: హైదరాబాద్‌లోని ప్రగతి భ‌వ‌న్‌లో జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సమావేశం ప్రారంభమైంది. శ‌నివారం మ‌ధ్యాహ్నం 2గంటల సమయంలో ఈ సమావేశం ప్రారంభ‌మైంది. స‌మావేశానికి మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, ఆయా శాఖ‌ల అధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ దళితబంధు, ధాన్యం కొనుగోళ్లపై దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ప్రభుత్వ పథకాల అమలు, యాసంగిలో పంటల సాగుపై సూచనలు చేయనున్నారు. వీటితోపాటు కరోనావైరస్ పరిస్థితి, వ్యాక్సినేషన్‌, న్యూ వేరియంట్ ఒమిక్రాన్, పోడు భూముల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో విస్తృతంగా చర్చించనున్నారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. కేంద్రం యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమని స్పష్టంగా చెప్పింది. దీనిలో భాగంగా యాసంగిలో ధాన్యం వద్దంటూ ప్రభుత్వం రైతులకు సూచిస్తోంది. ఈ మేరకు యాసంగిలో పంటమార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం కలెక్టర్లకు సూచించనున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించడం, యాసంగి పంటల సాగు, జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ అంశాలపై కార్యాచరణ ఖరారు చేసి కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయనున్నారు.

పల్లె ప్రగతి – పట్టణ ప్రగతి, హరితహారం, మెడికల్‌ కాలేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు, ధరణి సమస్యలు పలు అంశాలు కూడా ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటున్నారు. దళితబంధు పథకం అమలుపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చే అంశంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Also Read:

Kamareddy Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులతో సహా ఆరుగురు దుర్మరణం..

Delhi News: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. ఆటోరిక్షాపై బోల్తాపడిన కంటైనర్.. నలుగురు మృతి, పరారీలో డ్రైవర్