ఈ హిజ్రా మామూలు కిలాడీ కాదు.. ఏకంగా 6 కోట్ల రూపాయలు.. దిమ్మ తిరిగేలా..

ఆరు కోట్ల రూపాయలతో ఒకరు కుచ్చుటోపి పెట్టారు. ఘరానా కుచ్చుటోపీ పెట్టింది ఓ వ్యాపారి అనుకుంటే పొరపాటే. చిట్టిల పేరుతో ఆరు కోట్ల రూపాయలకు స్థానికులకు కుచ్చుటోపీ పెట్టింది ఓ హిజ్రా. బాధితుల ఫిర్యాదుతో పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు

ఈ హిజ్రా మామూలు కిలాడీ కాదు.. ఏకంగా 6 కోట్ల రూపాయలు.. దిమ్మ తిరిగేలా..
Money
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 17, 2023 | 9:30 PM

ఆరు కోట్ల రూపాయలతో ఒకరు కుచ్చుటోపి పెట్టారు. ఘరానా కుచ్చుటోపీ పెట్టింది ఓ వ్యాపారి అనుకుంటే పొరపాటే. చిట్టిల పేరుతో ఆరు కోట్ల రూపాయలకు స్థానికులకు కుచ్చుటోపీ పెట్టింది ఓ హిజ్రా. బాధితుల ఫిర్యాదుతో పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు ముందస్తు ఐపీ నోటీసులతో షాక్ ఇచ్చింది. యాదాద్రి జిల్లాలో పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో 25 ఏళ్లుగా మాధవి అనే హిజ్రా.. తన గ్యాంగ్ తో ఉంటోంది. స్థానిక మహిళల తో పాటు చిరు వ్యాపారులతో కూడా హిజ్రా మాధవి మంచి సంబంధాలు కలిగి ఉండేది. దీంతో కొంతకాలంగా మాధవి వద్ద స్థానికులు చిట్టీలు వేస్తున్నారు. తమ భవిష్యత్తు అవసరాల కోసం 50 మందికి పైగా హిజ్రా వద్ద చిట్టీలు వేస్తున్నారు.

ఎత్తిన చీట్టిల డబ్బులు తర్వాత ఇస్తానంటూ హిజ్రా మాధవి వాయిదా వేస్తోంది. సుమారు 6 కోట్ల రూపాయల చిట్టి డబ్బులతో నాలుగు రోజుల క్రితం హిజ్రా మాధవి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. హిజ్రా కోసం గాలించి బాధితులు పట్టుకొని యాదగిరిగుట్ట పోలీసులకు అప్పగించారు. పోలీసులతో తమకు చిట్టి డబ్బులు వస్తాయని బాధితులు ఆశపడ్డారు. కానీ చిట్టి డబ్బులు విషయమై హిజ్రా మాధవిని ప్రశ్నించగా.. ముందస్తుగా ఐపీ పెట్టానని చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు.

దీంతో ఏమి చేయలేక హిజ్రా మాధవితో సెటిల్ చేసుకోవాలంటూ బాధితులకు పోలీసులు ఉచిత సలహా ఇచ్చారు. తమ భవిష్యత్తు అవసరాల కోసం చిట్టీలు వేస్తే హిజ్రా మాధవి మోసం చేసిందని బాధితులు లబోది ఇవ్వమంటున్నారు. తమకేల న్యాయం జరుగుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..