మీ ఇంట్లో నల్లాలు జామ్ అవుతున్నాయా..? నీటి పైపులో అడ్డంకులు తొలగించడానికి సులభమైన మార్గాలు..!
నీటి పైపులను మూసుకుపోయే మురికిని తొలగించడానికి మనం ప్రత్యేకంగా తయారుచేసిన యాసిడ్‌లను ఉపయోగించవచ్చు. అయితే, నిపుణుడు సూచించిన విధంగా ఈ యాసిడ్ను ఉపయోగించడం అవసరం! ఇక, చివరగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పైప్‌లైన్‌లో పేరుకుపోయిన జామ్ క్లీయర్ కాకపోతే..పైపు లైన్ మార్చండి.!
మీ ఇంట్లో తరచూ వాటర్ పైప్‌లైన్ జామ్ అవుతుందా..? ఓ వైపు ఆఫీసులకు టైమ్ అవుతుంటే.. ఇంట్లో నీళ్లు రాక అవస్థలు పడుతున్నారా..? నీటి పైపులో అడ్డంకి తొలగించేందుకు కుస్తీలు పడుతున్నారా..? పదే పదే ప్లంబర్‌ని ఇంటికి పిలుస్తూ.. పార్స్ ఖాళీ చేసుకోవాల్సి వస్తుందా..? అయితే, జామ్ అయిన నీటి పైప్‌లైన్లను మీరే స్వయంగా, ఎలాంటి ఖర్చు లేకుండా క్లీయర్ చేసుకునే మార్గం ఉంది. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
1. బేకింగ్ సోడా – వెనిగర్!
ఇంట్లో జామ్ అయిన నళ్లాలను క్లీయర్ చేయటానికి వెనిగర్‌తో బేకింగ్ సోడా కలిపి చేసిన మిశ్రమం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమంతో మూసుకు పోయిన కళాయిలను సులభంగా సాఫ్ చెయొచ్చు.
2. నీటి గొట్టాలలో వేడి నీరు:
జామ్ అయిన నళ్లాలను క్లియర్ చేయడానికి సులభమైన మార్గాలలో ఒకటి నీటి పైప్ లైన్‌లో వేడి నీటిని పోయటం. పైప్ లైన్‌లో ఉప్పుపేరుకుపోవటం వల్ల ఏర్పడే అడ్డంకులను తొలగించడంలో వేడి నీరు సహాయపడుతుంది.
3. గాలి కొట్టడం కూడా:
జామ్ అయిన నీటి పైప్‌లైన్‌లో బాగా ప్రెజర్‌తో గాలి కొట్టడం వల్ల కూడా.. పైప్ లైన్‌లో పేరుకుపోయిన చెత్తా చెదారం ఆటోమేటిక్‌గా నీటితో పాటు డిస్చార్జ్ అవుతుంది.
4. వైర్ సహాయంతో క్లీయర్ చెయొచ్చు..
వంగుతున్న వైర్లు!ఫ్లెక్సిబుల్ వైర్లను పైప్‌లైన్ గుండా పంపి నీటి పైపులోని అడ్డంకులను తొలగించవచ్చు. దీంతో నీటి ఫ్లో పెరుగుతుంది.
5. కాస్టిక్ సోడా:
కాస్టిక్ సోడా!మార్కెట్‌లో లభించే ఈ కాస్టిక్ సోడాను మనం నీటి పైపులో పేరుకుపోయిన చెత్తా చెదారం శుభ్రం చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. మూసుకుపోయిన పైపులో ఈ కాస్టిక్ సోడా కొద్దిగా వేడి నీళ్లలో కలిపి పోస్తే మంచి ఫలితం ఉంటుంది.
6.యాసిడ్ వాడకం..
నీటి పైపులను మూసుకుపోయే మురికిని తొలగించడానికి మనం ప్రత్యేకంగా తయారుచేసిన యాసిడ్‌లను ఉపయోగించవచ్చు. అయితే, నిపుణుడు సూచించిన విధంగా ఈ యాసిడ్ను ఉపయోగించడం అవసరం!
ఇక, చివరగా ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ పైప్‌లైన్‌లో పేరుకుపోయిన జామ్ క్లీయర్ కాకపోతే..పైపు లైన్ మార్చండి.!
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..