AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇస్రో నుంచి శుభవార్త..! రెండో కక్ష్య కూడా విజయవంతం..ఈ సారి గురి తప్పేదేలే..

మొత్తం 40 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3 చంద్రుడిపై దిగనుంది. ముఖ్యంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌ను ల్యాండ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు.  అక్కడ రకరకాల అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇది మరే దేశం సాధించని ఘనత అని అన్నారు.

ఇస్రో నుంచి శుభవార్త..! రెండో కక్ష్య కూడా విజయవంతం..ఈ సారి గురి తప్పేదేలే..
Chandrayaan 3
Jyothi Gadda
|

Updated on: Jul 17, 2023 | 6:03 PM

Share

చంద్రయాన్ 3 ఉపగ్రహం ప్రణాళిక ప్రకారం ట్రాక్‌లో ఉందా? అనే ప్రశ్న యావత్‌ దేశం ఆలోచిస్తోంది. అయితే, దీనికి సమాధానం దొరికింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుభవార్త ప్రకటించింది.. అంటే చంద్రయాన్ 3 ఉపగ్రహాన్ని రెండో కక్ష్యలోకి చేర్చే ప్రయత్నం విజయవంతంగా పూర్తయింది. చంద్రయాన్ 3 అంతరిక్ష నౌక గురించి ముఖ్యమైన సమాచారం విడుదల చేసింది ఇస్రో. దీంతో ఉపగ్రహం ప్రతి దశలోనూ విజయవంతంగా కదులుతున్నట్లు తెలిసింది.

చందమామను చేరేందుకు జూలై 14న భూమి నుంచి బయలుదేరిన చంద్రయాన్‌-3 మిషన్‌ ఇస్రో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో స్పేస్‌ క్రాఫ్ట్‌ విజయవంతంగా ప్రయాణిస్తుంది.. ప్రయోగంలో భాగంగా ఇప్పటికే ఒకసారి మిషన్‌ కక్ష్యను పెంచిన ఇస్రో శాస్త్రవేత్తలు.. ఇవాళ రెండోసారి మూన్‌ మిషన్‌ కక్ష్య పెంపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు. ఇది భారతీయుల్లో సంతోషాన్ని నింపింది.

ఇవి కూడా చదవండి

అంతరిక్ష నౌక ప్రస్తుతం 41,603 కిమీ x 226 కిమీ కక్ష్యలో ఉంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య మరోసారి స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్‌లను మండించి కక్ష్యను మరింత పెంచనున్నారు. ఆ తర్వాత భూమికి 179 కిలోమీటర్ల దూరంలో వృత్తాకార మార్గంలో భూమి కక్ష్య స్థిరపడింది. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. అంతరిక్ష రంగంలో భారత్ కొత్త అధ్యాయాన్ని సృష్టించిందని పలువురు ప్రశంసించారు. చంద్రయాన్ 3 ఉపగ్రహం కార్యకలాపాలను ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

అంతరిక్ష నౌక ఆగస్టు 1 వరకు భూమి కక్ష్యలో ప్రయాణిస్తుంది. ఆ తర్వాత చంద్రునిపైకి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. మొత్తం 40 రోజుల అంతరిక్ష ప్రయాణం తర్వాత చంద్రయాన్ 3 చంద్రుడిపై దిగనుంది. ముఖ్యంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌ను ల్యాండ్ చేసేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేశారు.  అక్కడ రకరకాల అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇది మరే దేశం సాధించని ఘనత అని అన్నారు. చంద్రయాన్ 3 మిషన్ పూర్తయితే అమెరికా, రష్యా, చైనా తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ అవతరిస్తుందనడంలో సందేహం లేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్