Irradiation Technology: ఉళ్లి కుళ్లి పోకుండా కేంద్ర కసరత్తు.. సరికొత్త టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్ట్‌ మొదలు

పంట కోత అనంతర నష్టాల నుంచి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త టెక్నాలజీపై కసరత్తు చేస్తోంది. దీనికి రేడియేషన్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC)లో ఉల్లిని రేడియేషన్ చేసే పని జరుగుతోంది. 3 లక్షల టన్నులకు పైగా బఫర్ స్టాక్‌ను కొనుగోలు చేయడంతో పాటు, దానిని సురక్షితంగా ఉంచేందుకు ఈ కసరత్తు చేస్తోంది.

Irradiation Technology: ఉళ్లి కుళ్లి పోకుండా కేంద్ర కసరత్తు.. సరికొత్త టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్ట్‌ మొదలు
Irradiation Technology
Follow us
Surya Kala

|

Updated on: Jul 17, 2023 | 5:45 PM

దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా టమోటాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కొన్నిసార్లు ఉల్లిపాయలు, బంగాళాదుంపల తో పాటు అన్ని రకాల కూరగాయల ధరలు కూడా చుక్కలను తాకుతూ ఉంటాయి. ముఖ్యంగా దాదాపు ప్రతి సంవత్సరం ఉల్లి ధరలో హెచ్చు తగ్గులుంటాయి. ఒక్కసారిగా ఉల్లి ధర పైపైకి చేరుకుని సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయి. ఒకొక్కసారి ఉల్లిపాయ ధర పాలకుండా రోడ్ల పాలు అవుతుంది కూడా.. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉల్లి పాడవకుండా చర్యలు తీసుకోవడానికి ఆలోచిస్తుంది. తాజాగా ఉల్లి పై రేడియేషన్ టెక్నాలజీ ట్రయల్ ప్రారంభించింది. తద్వారా ఉల్లిపాయల జీవిత కాలం పెరుగుతుంది. రేడియేషన్ టెక్నాలజీపై ప్రభుత్వం పనిచేస్తోందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీ ఏమిటి.. కూరగాయలు కుళ్ళిపోకుండా ఎలా కాపాడుతుంది తెలుసుకుందాం.. ?

రేడియేషన్ టెక్నాలజీ అంటే ఏమిటంటే  రేడియేషన్ అంటే సాధారణ భాషలో గామా కిరణాలు, ఎక్స్-రే ఎలక్ట్రాన్ కిరణాలను రేడియేషన్‌కు ఉపయోగిస్తారు. ఈ కిరణాల ద్వారా ఆహార వస్తువులను లేదా ప్యాకేజీని నిల్వ చేయడాన్ని రేడియేషన్ అంటారు. ఉల్లిపాయలను రేడియేషన్ ప్రక్రియ ద్వారా నిల్వ చేస్తే.. అవి మొలకెత్తకుండా నిరోధిస్తుంది. అంతేకాదు ఉల్లిపాయలు కుళ్ళిపోయే అవకాశాలు తగ్గుతాయి. వాటి జీవిత కాలం పెరుగుతుంది.

ఈ టెక్నాలజీ అమెరికాలో కనుగొనబడింది ఆహార వికిరణాన్ని కనుగొన్న ఘనత USలోని మిస్సౌరీ విశ్వవిద్యాలయానికి చెందిన లూయిస్ స్టాడ్లర్‌కు చెందుతుంది. ముందుగా ఈ ప్రయోగం మొక్కల విత్తనాలపై చేశారు. ఉల్లిపాయలపై ముఖ్యంగా బంగాళాదుంపలు, వెల్లుల్లి, ఇతర ప్రధాన తృణధాన్యాలపై ఈ ప్రక్రియ ముందుగా చేశారు.

ఇవి కూడా చదవండి

నష్టాన్ని తగ్గించే రేడియేషన్ టెక్నాలజీ  ఉల్లి పంట వలన వచ్చే నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రేడియేషన్ టెక్నిక్ ద్వారా ఉల్లి నష్టాన్ని 25 శాతం నుంచి 10 నుంచి 12 శాతానికి తగ్గించవచ్చని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వద్ద ఉన్న బఫర్ స్టాక్ సురక్షితంగా ఉంటుంది. ఉల్లి ధరలు సామాన్యులకు అందుబాటులో లేని సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఉల్లి స్టాక్ ను ఉపయోగిస్తుంది. రేడియేషన్ టెక్నాలజీ ట్రయల్ ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్ట్‌గా కోబాల్ట్ -60 తో ఉల్లిపాయల వికిరణం మహారాష్ట్రలోని లాసల్‌గావ్‌లో జరుగుతోందని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి వెల్లడించారు.

రేడియేషన్ సురక్షితంగా ఉంటుందా రేడియేషన్‌తో ఆహారాన్ని నిల్వ చేయడం ఎంతవరకు సురక్షితం అనే విషయంలో US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA)తో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అనేక పరీక్షలు చేసాయి. తమ పరీక్షల్లో  రేడియేషన్ ప్రక్రియ పూర్తిగా సురక్షితమైనదని నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. ఈ పక్రియ కూరగాయల  జీవితాన్ని పెంచడమే కాకుండా.. ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాన్ని కూడా తగ్గిస్తుంది. వాస్తవానికి రేడియేషన్ ఆహారం ద్వారా సంక్రమించే వ్యాధులకు కారణమయ్యే జీవులను కూడా చంపుతుందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..