2 రూపాలయ ఖర్చుతో రెండు రోజుల్లోనే ముఖం తెల్లగా మారుతుంది..? అదేలాగంటే..

ఈ సీరమ్‌ను అప్లై చేసిన రెండు రోజుల తర్వాత, మీ ముఖంలో కొత్త మెరుపు కనిపిస్తుంది. కొందరు నారింజ లేదా నిమ్మరసం, దాని తొక్కను కలిపి ఇంట్లో విటమిన్ సి సీరమ్‌ను తయారు చేస్తారు. మీరు కూడా చేయవచ్చు. కానీ ఆ సీరం వెంటనే వాడాలి. ఇది ఫ్రిడ్జ్‌లో నిల్వచేసినప్పటికీ అది గరిష్టంగా ఒక వారం కంటే ఎక్కువగా ఉండదు. ఇది చాలా త్వరగా పాడైపోతుంది.

2 రూపాలయ ఖర్చుతో రెండు రోజుల్లోనే ముఖం తెల్లగా మారుతుంది..? అదేలాగంటే..
Vitamin C Serum
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 17, 2023 | 5:16 PM

ఒకే ఒక రెసిపీ మీ చర్మ సమస్యలన్నింటినీ పరిష్కరించగలుగుతుంది. అది విటమిన్ సి. ఈ విటమిన్ సిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల డార్క్ స్పాట్స్, యాక్నే స్కార్స్, అసమాన స్కిన్ టోన్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ వంటి వాటిని సరిచేస్తుంది. దాంతో మీ ముఖం ఆశ్చర్యకరంగా ప్రకాశవంతంగా, మెరుస్తూ ఉంటుంది. మార్కెట్లలో విక్రయించే విటమిన్ సి సప్లిమెంట్లు చాలా ఖరీదైనవి. అయితే, ఈ విటమిన్ సి సీరమ్ ను మనం ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అటువంటి సూపర్ ఎఫెక్ట్ విటమిన్ సి సీరమ్‌ని ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

చర్మంపై విటమిన్ సి సీరమ్ ఉపయోగించినప్పుడు మనం అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. కానీ రోజువారీ చర్మ సంరక్షణలో క్రమం తప్పకుండా ఉపయోగించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా వర్షాకాలంలో జిడ్డుగా, మురికిగా ఉన్న చర్మం చాలా తేలికగా లోపలికి చేరి మొటిమలు, బ్లాక్ హెడ్స్, మచ్చలు ఏర్పడతాయి. అటువంటి సమస్యలను నివారించడానికి మీ చర్మ సంరక్షణలో విటమిన్ సి సీరమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

విటమిన్ సి మన చర్మానికి వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. విటమిన్ సిని బేస్ మాస్క్‌గా, ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. కానీ, అప్పుడప్పుడు ఏదో మొక్కుబడిగా వాడితే..విటమిన్ సి చాలా నెమ్మదిగా చర్మంలోకి చొచ్చుకుపోతుంది. ఫలితాలు రావడానికి చాలా రోజులు పడుతుంది. కానీ, రెగ్యులర్ గా వాడితే చాలా సులభంగా చర్మంలోకి చొచ్చుకుపోయి చాలా త్వరగా ఫలితాలను ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇంట్లో విటమిన్ సి సీరమ్ ఎలా తయారు చేయాలి?

కావలసినవి..

విటమిన్ సి క్యాప్సూల్ – 4,

తేనె – ఒక చెంచా,

గ్లిజరిన్ – ఒక చెంచా,

అలోవెరా జెల్ – అర చెంచా

రెసిపీ..

విటమిన్ సి మాత్రలు మెడికల్ షాపుల్లో దొరుకుతాయి. ఒక మాత్ర ఖరీదు కనీసం రెండు రూపాయలు. అందులోంచి నాలుగు మాత్రలు తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తడిలేని గిన్నెలో తేనె, గ్లిజరిన్, అలోవెరా జెల్‌తో పాటు పొడి విటమిన్ సి మాత్రలను వేసి బాగా కలపాలి. అంతే మీ ముఖాన్ని ఏంజెల్ లా మెరిసిపోయేలా చేసేందుకు విటమిన్ సి సీరమ్ సిద్ధమైంది.

ఉపయోగించే విధానం..

ఉదయం తలస్నానం చేసిన తర్వాత లేదా మీ ముఖాన్ని బాగా కడిగిన తర్వాత టోనర్‌ను తేలికగా అప్లై చేయండి. ఈ విటమిన్ సి సీరమ్ పైన అప్లై చేసి రెండు నిమిషాల పాటు బాగా మసాజ్ చేయండి. మీరు పగటిపూట ఈ సీరమ్‌ను అప్లై చేసినట్టయితే.. సీరమ్‌ను అప్లై చేసిన తర్వాత ఐదు నిమిషాలకు మాయిశ్చరైజర్ లేదా సన్ స్క్రీన్ లోషన్‌ను అప్లై చేయండి. ఎందుకంటే బయటికి వెళ్లినప్పుడు దాని పైన విటమిన్ సి సీరమ్ ఉంటే సోలార్ రేడియేషన్ ప్రభావం వల్ల చర్మంపై కాస్త ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, మీరు బయటికి వెళ్లేటప్పుడు విటమిన్ సి సీరమ్‌ను అప్లై చేస్తే, దాని పైన మాయిశ్చరైజర్ లేదా సన్‌స్క్రీన్ అప్లై చేయండి.

మీరు ఈ విటమిన్ సి సీరమ్‌ను రాత్రిపూట కూడా అప్లై చేసుకోవచ్చు. రాత్రి సమయంలో, మీ ముఖాన్ని బాగా కడుక్కోండి. తేలికపాటి మాయిశ్చరైజర్‌ను రాసుకోండి. మీరు దాని పైన ఈ విటమిన్ సి సీరమ్‌ను అప్లై చేయవచ్చు.

గ్లిజరిన్, తేనె కలపడం వల్ల జిగటగా అనిపిస్తే గంట తర్వాత ముఖం కడుక్కోవచ్చు. లేదా రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం ముఖం కడుక్కోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ సీరమ్‌ను అప్లై చేసిన రెండు రోజుల తర్వాత, మీ ముఖంలో కొత్త మెరుపు కనిపిస్తుంది.

కొందరు నారింజ లేదా నిమ్మరసం, దాని తొక్కను కలిపి ఇంట్లో విటమిన్ సి సీరమ్‌ను తయారు చేస్తారు. మీరు కూడా చేయవచ్చు. కానీ ఆ సీరం వెంటనే వాడాలి. ఇది ఫ్రిడ్జ్‌లో నిల్వచేసినప్పటికీ అది గరిష్టంగా ఒక వారం కంటే ఎక్కువగా ఉండదు. ఇది చాలా త్వరగా పాడైపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు