- Telugu News Photo Gallery Hair care amla juice to carrot juice 5 juices that promote hair growth Telugu News
పట్టులాంటి మెరిసే జుట్టు కోసం అద్భుత డ్రింక్స్.. ఈ ఐదు జ్యూస్ లను ట్రై చేయండి..
పొడవైన, నల్లటి ఒత్తైన, నిగనిగలాడే అందమైన జుట్టు కావాలని ఆడవాళ్లందరూ ఆశపడుతుంటారు. అటువంటి జుట్టును పొందడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ హోం మేడ్ జ్యూస్‌లు. ఇలాంటి న్యాచురల్ జ్యూస్ లు తాగడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా నల్లగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట. అలాంటి ఇంట్లోనే తయారు చేసుకోగల జ్యూస్‌లు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Jul 15, 2023 | 2:36 PM

కలబంద రసంలో ఎంజైమ్, పోషకాలు నిండుగా ఉండి జుట్టు పెరిగేందుకు బాగా సహాయపడుతుంది. ఇది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. జుట్టు కుదుళ్లను పోషిస్తుంది.

కీర దోసకాయ జ్యూస్ కూడా జుట్టుకు చాలా మంచింది. ఇందులో సిలికాన్, సల్ఫర్ సమృద్ధిగా ఉండి జుట్టు మూలాలను బలపరుస్తుంది. తల వెంట్రుకలు తెగిపోకుండా చేస్తుంది. అలాగే జుట్టును మెరిసేలా చేస్తుంది.

క్యారెట్ జ్యూస్ కూడా కేశ సంరక్షణలో కీలకం. ఇందులో ఉండే బీటా-కెరోటిన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న క్యారెట్ జ్యూస్ జుట్టును బాగా పెంచుతుంది. ఇది జుట్టు పల్చబడడాన్ని నిరోధిస్తుంది. అలాగే జుట్టును షైనీగా చేస్తుంది.

పాలకూర జ్యూస్ తో జుట్టు బాగా పెరుగుతుంది. ఇందులో ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూర రసం తీసుకోవటం వల్ల తలకు రక్త ప్రసరణను పెరుగుతుంది. హెయిర్ ఫాలికల్స్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు పెరిగేలా చేస్తుంది.

ఉసిరి రసంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. ఈ రసం జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అలాగే జుట్టు పెరిగేందుకు సహాయపడుతుంది.




