Kitchen Tips: పిజ్జా నుండి ఫ్రెంచ్ ఫ్రైస్ వరకు ప్రతిదీ ఎయిర్ ఫ్రైయర్‌లో తయారు చేస్తున్నారా? అయితే మీ కోసమే ఇది

ఎయిర్ ఫ్రైయర్‌ ప్రస్తుతం ప్రతి వంట గదిలో ఉన్న ఒక ఎలక్ట్రానిక్ వస్తువు. ఇందులో ఈజీగా వంటలను చేస్తుంటారు. అంతేకాదు తక్కువ నూనెతో టేస్టీగా ఎయిర్ ఫ్రైయర్‌తో వంటలను క్షణాల్లో రెడీ చేస్తున్నారు.  మ్యారినేట్ చేసిన చేపలు, మాంసాన్ని నూనెతో బ్రష్ చేసిన తర్వాత ఎయిర్ ఫ్రైయర్‌ తో రెడీ చేస్తున్నారు. అయితే ఎయిర్ ఫ్రయ్యర్‌లో వండకూడని ఆహారాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాం.. 

Surya Kala

|

Updated on: Jul 17, 2023 | 7:57 PM

ప్రస్తుతం ప్రతి ఇంట్లోని వంటగదిలో ఎయిర్ ఫ్రైయర్ ఒక స్థానాన్ని ఆక్రమించింది. దీనితో త్వరగా స్నాక్స్ చేస్తారు. తక్కువ నూనెతో ఆహారాన్ని తయారు చేసుకోవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఎయిర్ ఫ్రైయర్ వంట చాలా ఆరోగ్యకరం. 

1 / 7
తక్కువ సమయంలో రుచికరమైన ఆహారాన్ని వండాలంటే ఎయిర్ ఫ్రైయర్స్ బెస్ట్ ఆప్షన్. ఫ్రెష్ ఫ్రై, స్టిర్ ఫ్రై చికెన్, గ్రిల్ చికెన్ వంటి ఆహారాన్ని తయారు చేయాలనుకుంటే ఎయిర్ ఫ్రైయర్ పనిని సులభతరం చేస్తుంది.

2 / 7
ఎయిర్ ఫ్రయ్యర్‌లో మెరినేట్ చేసిన చేపలు, మాంసాన్ని బ్రష్ చేసి పెట్టండి చాలు.. మీ పని పూర్తవుతుంది.  మైక్రోవేవ్ లా ఎక్కువ సమయం పట్టదు. అయితే ఈ ఎయిర్ ఫ్రైయర్ లో  మీరు అన్ని వంటలను చేయలేరు.

3 / 7
ఎయిర్ ఫ్రైయర్లలో అధిక ఉష్ణోగ్రతల వద్ద తక్కువ నూనెతో ఆహారం తయారు చేస్తారు. ఎయిర్ ఫ్రయ్యర్‌లో తయారు చేయకూడని ఆహారంలో చీజ్ బాల్స్ ఒకటి. ఈ ఛీజ్ బాల్స్ ను వేయించడానికి ఎయిర్ ఫ్రైయర్‌ను  ఉపయోగించవద్దు. జున్ను అధిక ఉష్ణోగ్రతల వద్ద కరుగుతుంది. ఎయిర్ ఫ్రయ్యర్‌కు అంటుకుంటుంది. ఎయిర్ ఫ్రయ్యర్‌ను తర్వాత శుభ్రం చేయడం కష్టం. ఎయిర్ ఫ్రయ్యర్ కూడా దెబ్బతింటుంది.

4 / 7
చాలా మంది మైక్రోవేవ్‌లో అన్నం వేడి చేస్తారు. అదే విధంగా ఎయిర్ ఫ్రైయర్ ను అన్నం వేడి చేయడానికి ఉపయోగించకండి. ఎయిర్ ఫ్రయ్యర్లు ఆహారాన్ని వేడి చేయడానికి లేదా ఉడికించడం కోసం తయారు చేయలేదు.   

5 / 7
రొట్టె కాల్చడానికి టోస్టర్ ఉపయోగించండి. ఎయిర్ ఫ్రైయర్‌లో బ్రెడ్, బన్స్, బర్గర్ బన్స్ ను వంటి వాటిని వేడి చేయవద్దు. ఈ ఆహార పదార్ధాలు అధిక ఉష్ణోగ్రతల వద్ద కాలిపోతాయి.

6 / 7
బర్గర్లు, పాస్తా, పిజ్జా తయారు చేయడానికి ఎయిర్ ఫ్రైయర్‌ని ఉపయోగించవద్దు. ఎయిర్ ఫ్రైయర్‌లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అలాంటి ఆహారాన్ని ఎయిర్ ఫ్రయ్యర్‌లో తయారు చేసుకోకపోవడమే మంచిది. 

7 / 7
Follow us