- Telugu News Photo Gallery Cinema photos Vishal first telugu singing song released from Mark Antony Movie
Vishal: విశాల్ కొత్త ట్యాలెంట్.. ‘మార్క్ ఆంటోనీ’ కోసం తెలుగులో పాట పాడిన స్టార్ హీరో
సెంట్ హీరోలు జస్ట్ హీరోలుగా మిగిలిపోవాలనుకోవటం లేదు. అందుకే ఛాన్స్ వచ్చిన ప్రతీసారి ఇతర డిపార్ట్‌మెంట్స్‌లోనూ తన టాలెంట్ చూపిస్తారు. హోమ్ గ్రౌండ్‌లోనే కాదు. ఇతర ఇండస్ట్రీల్లోనూ తాము మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో మార్క్ ఆంటోనిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విశాల్, తెలుగు ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు.
Updated on: Jul 17, 2023 | 7:17 PM

రీసెంట్ హీరోలు జస్ట్ హీరోలుగా మిగిలిపోవాలనుకోవటం లేదు. అందుకే ఛాన్స్ వచ్చిన ప్రతీసారి ఇతర డిపార్ట్‌మెంట్స్‌లోనూ తన టాలెంట్ చూపిస్తారు. హోమ్ గ్రౌండ్‌లోనే కాదు. ఇతర ఇండస్ట్రీల్లోనూ తాము మల్టీ టాలెంటెడ్ అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో మార్క్ ఆంటోనిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విశాల్, తెలుగు ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారు.

ఇప్పటికే హీరోగా నిర్మాతగా మంచి ఫామ్‌లో ఉన్న ఈ స్టార్ హీరో, నెక్ట్స్ సినిమాతో గాయకుడిగానూ తెలుగు ఆడియన్స్‌ను పలకరించబోతున్నారు. రీసెంట్‌గా మార్క్ ఆంటోని సినిమా కోసం ఓ తెలుగు పాటను రికార్డ్ చేశారు విశాల్. విశాల్ కన్నా ముందే టాలీవుడ్‌లో తమ గొంతు వినిపించిన తమిళ హీరోలు చాలా మందే ఉన్నారు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి తెలుగులో ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటున్న కార్తి, తెలుగు పాట కూడా పాడారు. సూపర్ హిట్ మూవీ ఒకే ఒక జీవితం సినిమా కోసం ఓ ప్రమోషనల్ సాంగ్‌ను స్వయంగా పాడి అందులో యాక్ట్ చేశారు.

ఇక మల్టీ టాలెంటెడ్ కోలీవుడ్ హీరో శింబు తెలుగు ఆడియన్స్‌కు గాయకుడిగానూ సుపరిచితుడే. టాలీవుడ్‌లో యంగ్ హీరోల సినిమాలకు తన వాయిస్‌తో మరింత ఎనర్జీ యాడ్ చేస్తున్నారు శింబు.

ఈ ట్రెండ్‌ను ఎప్పటి నుంచో కంటిన్యూ చేస్తున్న కోలీవుడ్ టాప్ స్టార్ కమల్ హాసన్. 80స్‌లోనే తెలుగులో పాటలు పాడిన రికార్డ్ కమల్ సొంత. ఈ జనరేషన్ స్టార్స్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవటంతో పాటు పాటలు పాడుతున్నారు.




