Viral News: ఎయిర్ పోర్ట్‌లో మ్యాగీ మసాలా ధర చూసి మహిళ షాక్.. ప్లేట్ మ్యాగీ ధర రూ.193..
మ్యాగీ కేవలం రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు మ్యాగీ ప్యాకెట్ ధర రూ.10లుండేది. తర్వాత దీని ధర రూ.12కి పెరిగింది. ఇప్పుడు దీని ధర రూ.14కి పెరిగింది. అయితే ఎప్పుడైనా మ్యాగీ ప్యాకెట్ ధర రూ.180-190ఉంటుందని ఊహిచారా..! అవును ఎయిర్‌పోర్ట్‌లో మ్యాగీ ధర వందకు పైగా ఉండి అందరికీ షాక్ ఇచ్చింది.
మ్యాగీ ప్రస్తుతం చిన్న పెద్దలకు ఇష్టమైన ఆహారంగా మారింది. ఆకలి అనిపించిన వెంటనే చాలు వెంటనే మ్యాగీ వైపు దృష్టి సారిస్తారు. కనుక ఇది ఆకలిని తక్షణమే తగ్గించే ఆహారంగా మారింది. మ్యాగీ తయారీకి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ఇంకా చెప్పాలంటే మ్యాగీ కేవలం రెండు నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఒకప్పుడు మ్యాగీ ప్యాకెట్ ధర రూ.10లుండేది. తర్వాత దీని ధర రూ.12కి పెరిగింది. ఇప్పుడు దీని ధర రూ.14కి పెరిగింది. అయితే ఎప్పుడైనా మ్యాగీ ప్యాకెట్ ధర రూ.180-190ఉంటుందని ఊహిచారా..! అవును ఎయిర్‌పోర్ట్‌లో మ్యాగీ ధర వందకు పైగా ఉండి అందరికీ షాక్ ఇచ్చింది.
అసలు విషయం ఏంటంటే.. ఎయిర్‌పోర్ట్‌లో ఓ మహిళ రూ.193కి మసాలా మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్‌ను తిని, దాని బిల్లును సోషల్ మీడియాలో షేర్ చేసింది. మ్యాగీ ధర ఇంత ఎక్కువగా ఉంటుందా అంటూ తమని తామే ప్రశ్నించుకుంటున్నారు.. ఆ ధర విషయం నమ్మలేకపోతున్నారు. బిల్లులో మసాలా మ్యాగీ ధర రూ.184 .. జీఎస్టీని జోడించిన తర్వాత దాని ధర రూ.193 అయింది. మ్యాగీ తిన్న తర్వాత ఆ మహిళ UPI ద్వారా చెల్లించింది. మ్యాగీ బిల్లు తీసుకున్న తర్వాత ఆమె మొదట దాన్ని ఫోటో తీసి తన ట్విట్టర్ ఐడిలో షేర్ చేసింది.
ఆ మహిళ పేరు సెజల్ సూద్. ఈ బిల్లును ట్విట్టర్‌లో షేర్ చేస్తూ సెజల్ ఇలా రాశారు, ‘నేను ఎయిర్‌పోర్ట్‌లో రూ. 193కి మ్యాగీని కొనుక్కున్నాను. ఖరీదు చూసి ఎలా స్పందించాలో తనకు తెలియడం లేదని చెప్పింది. అంతేకాదు ఎవరైనా ఇంత ఎక్కువ ధరకు మ్యాగీని ఎందుకు విక్రయిస్తారు. ఈ బిల్లును చూసిన ప్రజలు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇంత ఖరీదు పెట్టి ఎందుకు కొన్నారని ఒకరు అడిగారు. దానికి సమాధానంగా, సెజల్ తనకు రెండు గంటల నుంచి ఆకలిగా ఉందని.. అందుకే కొనవలసి వచ్చిందని చెప్పింది.
I just bought Maggi for ₹193 at the airport
And I don’t know how to react, why would anyone sell something like Maggi at such an inflated price 🥲 pic.twitter.com/oNEgryZIxx
— Sejal Sud (@SejalSud) July 16, 2023
అదే సమయంలో, మరొకరు మాట్లాడుతూ, ‘ఇండిగో విమానాలలో కూడా ఇది రూ. 250కి అమ్ముతున్నారు అని చెప్పారు. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వినియోగదారుల జేబులు ఖాళీ కాకుండా ఉండడానికి.. ఆకలిని తీర్చడానికి ధరలపై పరిమితి విధించాలని కోరుతున్నాడు. ఇంకొకరు తాము విమానంలో ప్రయాణించే సమయంలో ఇంటి నుండి ఆహారంతీసుకుని వెళ్తున్నామని.. ఈ ధరలను చూసి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..