Viral Video: స్కూలు పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న డ్రైవర్.. నెట్టింట్లో షాకింగ్ వీడియో వైరల్
చిన్నారి స్టూడెంట్స్ చేస్తోన్న ఈ ప్రమాదకరమైన ప్రయాణం చూపరులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ వీడియో గుజరాత్‌లోని దాహోద్‌కి చెందింది అని తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో సుమారు 24 మంది స్కూల్ స్టూడెంట్స్ పశువులను వాహనాల్లో తరలిస్తున్నట్లు తీసుకుని వెళ్తున్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలు సమయానికి క్షేమంగా స్కూల్ కు లేదా ఇంటికి చేరుకుంటారని భావించి వ్యాన్, ఆటో, బస్సు లేదా ఇతర వాహనాల్లో పాఠశాలకు పంపుతున్నారు. అయితే ప్రస్తుతం ఒక స్టూడెంట్స్ కు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసి పిల్లల తల్లిదండ్రులు షాక్ అవుతారు. వాస్తవానికి వైరల్ క్లిప్‌లో స్కూల్ స్టూడెంట్స్ ఒక ట్రాలీ లాంటి నాలుగు చక్రాల వాహనంలో గొర్రెలు, మేకల వలె ఇరుక్కుని కూర్చుకున్నారు. అంతేకాదు ఎక్కువ మంది పిల్లలు వాహనం పైకప్పు , బానెట్‌పై కూర్చుని ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తుంది.
చిన్నారి స్టూడెంట్స్ చేస్తోన్న ఈ ప్రమాదకరమైన ప్రయాణం చూపరులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ వీడియో గుజరాత్‌లోని దాహోద్‌కి చెందింది అని తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో చక్కర్లు కొడుతోంది. వీడియోలో సుమారు 24 మంది స్కూల్ స్టూడెంట్స్ పశువులను వాహనాల్లో తరలిస్తున్నట్లు తీసుకుని వెళ్తున్నారు. అంతేకాదు కొంతమంది పిల్లలు కారు వెనుక వేలాడుతూ ఉండగా, చాలా మంది పైకప్పుపై కూర్చున్నారు. మరి కొందరిని మంది పిల్లలను వాహనం బానెట్‌పై కూర్చోబెట్టాడు డ్రైవర్.
ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં @narendramodi @Bhupendrapbjp ના રાજકીય કાર્યક્રમો માટે ST બસ ગોઠવાય જાય પરંતુ બાળકોને સ્કૂલ જવા માટે બસ ના મૂકાય! વિકાસના બણગા ફૂંકતી સરકારની જમીની વાસ્તવિકતા.#GujaratModel pic.twitter.com/ioUQuRhO9O
— Amit Chavda (@AmitChavdaINC) July 14, 2023
అదే సమయంలో ఈ వీడియోపై రాజకీయాలు మొదలయ్యాయి. గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు అమిత్ చావ్డా ట్విట్టర్‌లో వీడియో షేర్ చేశారు. అంతేకాదు రాజకీయ కార్యక్రమాల కోసం బస్సులు ఏర్పాటు చేస్తారు.. కానీ పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి బస్సులు లేవని కామెంట్ జత చేశారు. ఈ వీడియోకి నెటిజన్ల నుంచి భారీ స్పందన లభిస్తుంది.
వైరల్ క్లిప్‌లో కనిపించే పాఠశాల విద్యార్థుల వయస్సు కేవలం 13 మరియు 14 సంవత్సరాల మధ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన నెటిజన్లు డ్రైవర్ , తల్లిదండ్రులు పిల్లల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..