Viral: గాల్లో ఉండగానే పైలట్‌కు అస్వస్థత.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే.!
విమానం గాల్లో ఉండగానే పైలట్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. అది గమనించి ఓ ప్రయాణికురాలు ఫ్లైట్‌ను ల్యాండ్ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఆ విమానం రన్‌వేకు బయట కూలిపోయింది. దాంతో పైలట్, ఆ మహిళకు స్వల్పగాయాలయ్యాయి. పైలట్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అమెరికాలోని మసాచుసెట్స్‌లోని విన్‌యార్డ్ ఎయిర్‌పోర్ట్‌లో జూలై 14న ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. న్యూయార్క్‌లోని వెస్ట్‌చెస్టర్ నుంచి బయల్దేరిన ఓ విమానం విన్‌యార్డ్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవ్వాల్సిన సమయానికి ఆ ఫ్లైట్ పైలట్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఓ మహిళా పాసింజర్ ఆ విమానాన్ని ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించింది. అది కాస్తా రన్‌వేకు సమీపంలో క్రాష్ ల్యాండ్ అవ్వడంతో స్వల్పంగా దెబ్బతింది. అనంతరం ఆ విమానం నడిపిన మహిళను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స తర్వాత ఆమె డిశ్చార్జ్ అయినట్టు మసాచుసెట్స్ పోలీసులు తెలిపారు.