Video: లేటు వయసులో ఘాటు ఇన్నింగ్స్.. లీగ్‌లోనే భారీ సిక్స్.. బాదిన సీఎస్కే కోచ్.. బాల్ ఎలా వెళ్లిందో తెలుసా?
Major League Cricket 2023: మేజర్ లీగ్ క్రికెట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ వర్సెస్ వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 6 పరుగుల తేడాతో గెలిచింది.
ప్రస్తుతం అమెరికాలో మేజర్ లీగ్ క్రికెట్ జరుగుతోంది. ఈ క్రమంలో టెక్సాస్ సూపర్ కింగ్స్ వర్సెస్ వాషింగ్టన్ ఫ్రీడమ్ మధ్య జరిగిన ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో టెక్సాస్ సూపర్ కింగ్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బ్రావో ఇటీవలే ఆడిన IPL 2023లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా కనిపించాడు. కానీ, ఇక్కడ మేజర్ లీగ్ క్రికెట్‌లో అతను తన బ్యాటింగ్‌తో సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఈ లీగ్‌లో పొడవైన సిక్స్ కొట్టాడు.
ఈ పొడవైన సిక్స్ వీడియో మేజర్ లీగ్ క్రికెట్ అధికారిక సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. వాషింగ్టన్ ఫ్రీడమ్ ఫాస్ట్ బౌలర్ ఎన్రిక్ నార్కియా బౌలింగ్‌లో బ్రావో ఈ సిక్స్ కొట్టాడు. నార్కియా ఈ బంతిని గంటకు 143.3 కిమీ వేగంతో విసిరాడు. రెండో ఇన్నింగ్స్ 17వ ఓవర్ రెండో బంతికి ఈ సిక్స్ కొట్టాడు. ఈ సిక్స్ పొడవు 106 మీటర్లు. ఈ వీడియోకు “చంద్రుడి వద్దకు” “డ్వేన్ బ్రావో టోర్నమెంట్‌లో అతిపెద్ద సిక్స్ కొట్టాడు!” అని క్యాప్షన్ అందించారు.
పరుగుల ఛేదనలో బ్రావో 39 బంతుల్లో 76* పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బ్రావో ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. బ్రావో తన ఇన్నింగ్స్‌ను చాలా నెమ్మదిగా ప్రారంభించాడు. తొలి 18 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేశాడు. దీని తర్వాత బ్రావో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించాడు.
తుఫాన్ ఇన్నింగ్స్ ఆడినా ఓటమే..
TO THE MOON🌕!
Dwayne Bravo with the BIGGEST SIX of the tournament!
1⃣1⃣5⃣/6⃣(17.2) pic.twitter.com/xDyWKy25nL
— Major League Cricket (@MLCricket) July 17, 2023
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వాషింగ్టన్ ఫ్రీడమ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. జట్టు తరఫున ఓపెనర్ మాథ్యూ షార్ట్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగలిగింది. బ్రావో అద్భుత ఇన్నింగ్స్ జట్టును విజయపథంలోకి తీసుకెళ్లలేకపోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..