బీర్‌తో ఫేస్ మాస్క్..! చర్మంపై మ్యాజిక్ చేస్తుంది.. ఇది మీకు తెలుసా..?
లాగే ఆల్మండ్ ఆయిల్ వేసి పేస్ట్ లా అయ్యే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ ప్రాంతాల్లో అప్లై చేసి నెమ్మదిగా మర్దన చేయాలి. సుమారు 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. సహజంగా ఆరనివ్వండి.
బీర్ శరీరానికి హానికరమైన పానీయం అయినప్పటికీ, ఇది చర్మంపై చాలా మ్యాజిక్ చేయగలదంటున్నారు ఆరోగ్య నిపుణులు. బీర్ చర్మాన్ని శుభ్రపరుస్తుంది. సూక్ష్మక్రిముల నుండి రక్షిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యాన్ని నివారించడంలో గ్రేట్ గా సహాయపడతాయంటున్నారు. చిన్న వయసులో చర్మం ముడతలు తగ్గడానికి బీర్ ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..
* బీర్ – 1 టీస్పూన్
* గుడ్డులోని తెల్లసొన
* బాదం నూనె – 4 చుక్కలు
ముందుగా ఒక గిన్నెలో గుడ్డులోని తెల్లసొన, బీరు వేసి బాగా కలపాలి. అలాగే ఆల్మండ్ ఆయిల్ వేసి పేస్ట్ లా అయ్యే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ ప్రాంతాల్లో అప్లై చేసి నెమ్మదిగా మర్దన చేయాలి. సుమారు 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. సహజంగా ఆరనివ్వండి.
ఆ తర్వాత ఫేస్ మాస్క్ ని గోరువెచ్చని నీటితో కడగాలి. చివరగా, ముఖాన్ని మృదువుగా తడిలేకుండా తుడిచి మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం ముడతలు పడకుండా చూసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..