AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ponguleti Srinivas Reddy: ఖమ్మం SR గార్డెన్స్‌లో రెవెన్యూ అధికారుల సర్వే.. పోలీసులు, అధికారులతో పొంగులేటి వర్గీయుల వాగ్వాదం

Khammam News: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన SR గార్డెన్స్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. SR గార్డెన్స్‌ నందు పోలీసుల సమక్షంలో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు ల్యాండ్‌ సర్వేకు ప్రయత్నించారు. SR గార్డెన్స్‌ స్థలంలో ఎన్‌ఎస్పీ..

Ponguleti Srinivas Reddy: ఖమ్మం SR గార్డెన్స్‌లో రెవెన్యూ అధికారుల సర్వే.. పోలీసులు, అధికారులతో పొంగులేటి వర్గీయుల వాగ్వాదం
Ponguleti
Sanjay Kasula
|

Updated on: Jul 17, 2023 | 9:07 PM

Share

ఖమ్మం, జూలై 17: ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన SR గార్డెన్స్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. SR గార్డెన్స్‌ నందు పోలీసుల సమక్షంలో ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు ల్యాండ్‌ సర్వేకు ప్రయత్నించారు. SR గార్డెన్స్‌ స్థలంలో ఎన్‌ఎస్పీ భూమి ఉందంటూ జాయింట్ సర్వే చేయబోయారు. అయితే.. మార్కింగ్‌ పెట్టేందుకు అధికారులు ప్రయత్నించగా.. పొంగులేటి అనుచరులు అడ్డుకున్నారు. పోలీసులు, అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోర్టు పరిధిలో ఉంటే ఎలా సర్వే చేస్తారంటూ ప్రశ్నించారు. అనంతరం.. అధికారుల తీరును వ్యతిరేకిస్తూ.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు పొంగులేటి అనుచరులు. ఇక.. ఎస్ఆర్ గార్డెన్స్‌ స్థలం విషయంలో కొంతకాలంగా వివాదం నడుస్తోంది.

ఇదిలావుంటే… హైకోర్టు ఆదేశాలతోనే ఇరిగేషన్‌, రెవిన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి.. మార్కింగ్‌ చేశామన్నారు ఖమ్మం అర్బన్‌ ఎమ్మార్వో శైలజ. పొంగులేటి ప్రసాద్‌రెడ్డి అనే వ్యక్తి ఎన్‌వోసీ కోసం ఇరిగేషన్‌ అధికారులకు దరఖాస్తు చేసినట్లు హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. ధర్మాసనం ఆదేశాల మేరకు సర్వే చేపట్టామని.. SR గార్డెన్స్ యాజమాన్యాన్ని పిలిచినప్పటికీ హాజరు కాలేదని చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Follow Us
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
కుర్రకారును ఆకట్టుకుంటున్న ట్రెండింగ్ హీరోయిన్స్
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
రాబోయే భారీ చిత్రాలకు తప్పని గ్రాఫిక్స్ కష్టాలు
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. త్వరలో పెట్రోల్‌ బైక్స్‌ బ్యాన్..!
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
వందల కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా ?? కారణాలివే
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
స్పిరిట్ పై విమర్శలు.. ఐ డోంట్ కేర్ అంటున్న సందీప్ వంగా
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
కలిసి 20 సినిమాలు.. అయినా ఆమెతో 30ఏళ్లు మాట్లాడని హీరో కృష్ణ
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
జన నాయగన్‌ను వాళ్లే లీక్ చేశారా ?? పైరసీ వెనుక రాజకీయ కుట్ర
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
చికెన్‌లోని ఈ పార్ట్స్‌తో జాగ్రత్త.. మర్చిపోయి కూడా తినొద్దు..
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
వంటగది టైల్స్‌పై జిడ్డు మరకలా? ఆ సమస్యకు చెక్ పెట్టండిలా!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!
బంగారమే కాదు, అక్షయతృతీయ రోజు ఇవి కొన్నా అదృష్టం కలిసొస్తది!