AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊటీలో దాగివున్న చిరపుంజీ.. ఎవ్వరికీ తెలియని అద్భుత ప్రదేశం…!

అంతే కాదు, ఇక్కడ మనం చాలా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రదేశంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కొద్దిరోజుల పాటు ట్రాఫిక్, కలుషిత నగర జీవనం నుంచి బయటపడాలనుకునే వారికి ఈ ప్రదేశం నిజంగానే స్వర్గధామం.

ఊటీలో దాగివున్న చిరపుంజీ.. ఎవ్వరికీ తెలియని అద్భుత ప్రదేశం...!
Devala
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 17, 2023 | 8:25 PM

ఊటీ …తమిళనాడులోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్. మీరు టూర్‌కి వెళ్లాలనుకున్నా లేదా ఒక రోజు సరదాగా రైడ్‌కి వెళ్లాలనుకున్నా టక్కున్న గుర్తొచ్చే ప్రదేవం ఊటీ. ఇది పచ్చని అడవులు, పచ్చికభూములు, సున్నితమైన గాలి, తెల్లటి మేఘాలు వంటి అనేక సౌందర్యాలను సంతరించుకుని ఉంటుంది. వేసవిలో కుటుంబ సమేతంగా సందర్శించాలనుకునే పర్యాటక ప్రదేశాల జాబితాలో ఊటీది ఎప్పుడూ ప్రత్యేక స్థానం. ఊటీ సరస్సు, చిల్డ్రన్స్ పార్క్, బొటానికల్ గార్డెన్, తొట్టపేట, ఎమరాల్డ్ లేక్, అవలాంచి, ముదుమలై వన్యప్రాణుల అభయారణ్యం, రోజ్ గార్డెన్, బైకారా జలపాతం, బైకారా బోట్ రైడ్ వంటి అనేక ప్రదేశాలు ఇక్కడ సందర్శకులను అలరిస్తుంటాయి. ఊటీలో సాధారణంగా ప్రకృతి విస్తారంగా ఉంటుంది. కానీ, ఊటీలో చాలామందికి తెలియని అందమైన ప్రదేశం ఒకటి ఉంది. అదే ‘దేవాల’.

నీలగిరిలో ఉన్న దేవాల కూడలూరు-పందలూరు రహదారి నుండి 17 కిలో మీటర్ల దూరంలో దేవలా కేరళ, తమిళనాడు మధ్య ఉన్న ఒక చిన్న హిల్ స్టేషన్. ఇది పచ్చని ప్రకృతి దృశ్యాలతో నిండిన రద్దీ లేని పర్యాటక ప్రదేశం. ఇక్కడ మనకు ఎక్కువ మంది పర్యాటకులు కనిపించరు. దీనిని దక్షిణ భారతదేశంలోని చిరపుంజిగా పిలుస్తారు.

భారతదేశంలోని మేఘాలయలోని చిరపుంజిలో అత్యధిక వర్షపాతం ఉంటుంది. అదే విధంగా దేవాల కొండ ప్రాంతంలో 6 నెలలకు పైగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి దేవాలాను దక్షిణ భారతదేశంలోని చిరపుంజి అని కూడా అంటారు. వర్షాకాల ప్రేమికులకు ఇది అనువైన ప్రదేశం. ఇక్కడ ఏటవాలుగా ఉన్న తేయాకు తోటల అందాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి.

ఇవి కూడా చదవండి

అంతే కాదు, ఇక్కడ మనం చాలా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రదేశంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కొద్దిరోజుల పాటు ట్రాఫిక్, కలుషిత నగర జీవనం నుంచి బయటపడాలనుకునే వారికి దేవాల స్వర్గధామం.

పొగమంచును చీల్చుకుంటూ వచ్చే సూర్యుడు ఇక్కడ మన ఉదయాలను తియ్యగా మారుస్తుంది. వాహనాల సందడికి దూరంగా ఎక్కడ చూసినా పక్షుల సందడి. కాబట్టి, పక్షి ప్రేమికులు సందర్శించడానికి ఇది మంచి ప్రదేశం. అలాగే, దేవాల సమీపంలో చకున్ను అనే ప్రాంతంలో నీరు జలపాతంలా ప్రవహిస్తుంది. ఇక్కడ మీరు స్నానాలు చేస్తూ ఎంజాయ్‌ చెయొచ్చు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..