Seema Haider: సీమా హైదర్‌ను కస్టడీలోకి తీసుకున్న యూపీ ఏటీఎస్ పోలీసులు.. పాకిస్తాన్ ఆర్మీ సంబంధాలపై విచారణ..
Seema Haider News: సీమా హైదర్‌ను కస్టడీలోకి తీసుకున్నారు యూపీ ఏటీఎస్ పోలీసులు.. ఆమెకు పాకిస్తాన్ ఆర్మీతో ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్నారు. పాక్ గూఢచారిగా అనుమానిస్తున్నారు.
పాకిస్తాన్ మహిళ సీమా హైదర్, సచిన్‌ల ప్రేమ కథ దేశంలో చర్చనీయాంశంగా ఉంది. ఇదిలా ఉంటే సీమా హైదర్ కూడా పాక్ గూఢచారి అనే ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా యూపీ ఏటీఎస్ బృందం పాకిస్తాన్ నివాసి సీమా హైదర్‌ను అదుపులోకి తీసుకుంది. ఏటీఎస్ సీమా హైదర్‌ను రహస్య ప్రదేశంలో ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం. సీమా హైదర్ మొదటి నుంచి ఏటీఎస్ రాడార్‌లో ఉన్నారు. ఆమె తన ప్రేమికుడు సచిన్‌ను కలవడానికి నేపాల్ మీదుగా భారత్‌లోకి వచ్చారు. ఇప్పుడు ఏటీఎస్ బృందం వాట్సాప్ చాట్ , అన్ని ఆధారాల ఆధారాలను పరిశీలిస్తున్నారు. అంతే కాదు వారి పరిచయం ఎలా జరిగింది అనే విచారణ జరుపుతున్నారు.
దీంతో పాటు సీమ ఐడీ కార్డులను హైకమిషన్‌కు పంపించగా.. సీమ మామ పాకిస్థాన్ ఆర్మీలో సుబేదార్ అని, సీమ సోదరుడు పాకిస్తాన్ సైనికుడని తెలిసింది. భారత భద్రతా ఏజెన్సీ ఇప్పుడు సరిహద్దులపై ఫోకస్ పెట్టింది. లవ్ స్టోరీ నుంచి ఇండియాకి వచ్చే వరకు అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఏటీఎస్ బృందాలు. సీమా పాకిస్థాన్ పౌరురాలేనని.. ఆమె రాకలో చాలా సమస్యలు ఉన్నాయని యూపీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇలవంటి పరిస్థితిలో, ఆమెను విచారించడం అవసరం.. కాబట్టి దేశ భద్రతకు సంబంధించిన అన్ని ఏజెన్సీలు విచారిస్తున్నాయని తెలిపారు.
2019లో PUBG ఆడుతున్నప్పుడు సీమా, సచిన్ మీనా ఒకరికొకరు పరిచయం అయ్యారు. అలా వారి ప్రేమకథ మొదలైంది. దీని తరువాత, మే 13, 2023 న సీమా హైదర్ నేపాల్ మీదుగా బస్సు ఎక్కి భారతదేశానికి వచ్చింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, సీమా- సచిన్ గ్రేటర్ నోయిడాలోని రబుపురా ప్రాంతంలో నివసిస్తున్నారు. అక్కడ సచిన్ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అదే సమయంలో, వీసా లేకుండా నేపాల్ ద్వారా తన నలుగురు పిల్లలతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించినందుకు సీమాను పోలీసులు జూలై 4న అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం