Telangana: పురాతన ఇంటిలో తవ్వకాలు.. కట్ చేస్తే ఊహించని సీన్.. ఒక్కసారిగా ఫ్యూజులు ఔట్.!

ఎప్పుడో పూర్వకాలం కట్టిన ఇల్లు.. అంతా పాడుబడిపోవడంతో ఆ ఇద్దరు అన్నదమ్ములు పాత ఇంటిని కూల్చేసి కొత్త...

Telangana: పురాతన ఇంటిలో తవ్వకాలు.. కట్ చేస్తే ఊహించని సీన్.. ఒక్కసారిగా ఫ్యూజులు ఔట్.!
Gupta Nidhulu
Follow us
Ravi Kiran

| Edited By: Anil kumar poka

Updated on: Mar 10, 2022 | 11:22 AM

ఎప్పుడో పూర్వకాలం కట్టిన ఇల్లు.. అంతా పాడుబడిపోవడంతో ఆ ఇద్దరు అన్నదమ్ములు పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇంటిని నిర్మించాలనుకున్నారు. అందుకోసం జేసీబీ సాయంతో పురాతన ఇంటిని కూల్చడానికి నిర్ణయించారు. కూల్చివేత మొదలైంది.. కట్ చేస్తే ఊహించని సీన్ ఆ ఇద్దరి అన్నదమ్ములకు ఎదురైంది. అదృష్టం వరించింది. మరి అదేంటో తెలుసుకుందాం పదండి..

అసలు విషయానికొస్తే.. తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఊట్కూరు మండల కేంద్రంలో గుప్త నిధులు బయటపడ్డాయి. నీలి రాజు, ఉమా మహేష్ అనబడే ఇద్దరు అన్నాదమ్ములు తమ పురాతన ఇంటిని కూల్చుతుండగా, నిజాంకాలం నాటి పురాతన వెండి నాణాలు బయటపడ్డాయి. దీంతో స్థానికంగా గుప్తనిధుల కలకలం మొదలైంది. నీలిరాజు, ఉమా మహేష్ వారు ఉంటున్న పాత ఇంటిని తొలగించి కొత్త ఇంటిని నిర్మించేందుకు తవ్వకాలు చేపట్టారు. జేసీబీ సాయంతో పురాతన ఇంటిని కూల్చే సమయంలో వెండి నాణాలు బయట పడ్డాయి. వాటిని సేకరించిన జేసీబీ డ్రైవర్‌..తన మిత్రునికి విషయం చెప్పాడు. దాంతో నోటా ఈ నోటా ఈ వార్త ఊరు మొత్తం పాకింది.. ఇది తెలిసిన ఊరి జనం నాణాల కోసం ఎగబడ్డారు. ఆ ప్రాంతంలో జల్లెడ పట్టడం ప్రారంభించారు. దొరికిన కాడికి తమ ఇండ్లకు తీసుకెళ్లారు.

తవ్వకాల్లో లభించిన నాణాలు..నిజాం పాలన, చార్మినార్ రూపీ హైదరాబాద్ స్టేట్ కు సంబంధించిన 1911నుండి 1925 కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఒక్కో నాణేం బరువు దాదాపు 11.8 గ్రాములు ఉందని తెలిసంది. అప్పటి రాజు ఉస్మాన్ అలీ ఖాన్ కాలం నాటివని, వాటిపైన ఉర్దూలో లిఖిత పూర్వకంగా రాసి ఉన్నందున నాణాలకు ప్రాధాన్యత, గుర్తించేందుకు వీలైందని అధికారులు చెబుతున్నారు.

Also Read:

Viral Video: ఇలా ఉన్నారేంట్రా బాబు.. నటనకు ఆస్కార్ ఇచ్చేయొచ్చు.. ఈ వీడియో నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్!

Viral Photo: మాములుగా ఉండదు మనతో.. ఈ ఫోటోలో పామును కనిపెడితే మీరే జీనియస్.!!

Telangana: కొండ గుహ నుంచి వింత శబ్దాలు.. భయపడుతూ వెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.!

Cricket: 53 పరుగులకే 7 వికెట్లు.. కట్ చేస్తే ప్రత్యర్ధి బౌలర్లపై కెప్టెన్ పెను విధ్వంసం.. చివరికి..