Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Rao: గ్రామాల అభివృద్ధిపై అక్కడే తేల్చుకుందాం పదండి.. భట్టికి మంత్రి హరీష్ సవాల్

Telangana Assembly: అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు గుడ్డిగా మాట్లాడొద్దంటూ ఆర్ధిక మంత్రి హరీష్ రావు సూచించారు. అభివృద్ధి జరగలేదని గుడ్డిగా మాట్లాడితే కాంగ్రెస్‌కు ఉన్న ఆరు సీట్లు సైతం

Harish Rao: గ్రామాల అభివృద్ధిపై అక్కడే తేల్చుకుందాం పదండి.. భట్టికి మంత్రి హరీష్ సవాల్
Bhatti Harish Rao
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 09, 2022 | 5:14 PM

Telangana Assembly: అభివృద్ధిపై ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు గుడ్డిగా మాట్లాడొద్దంటూ ఆర్ధిక మంత్రి హరీష్ రావు సూచించారు. అభివృద్ధి జరగలేదని గుడ్డిగా మాట్లాడితే కాంగ్రెస్‌కు ఉన్న ఆరు సీట్లు సైతం పోతాయంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో పైరవీలు తప్ప- పారదర్శకత లేదంటూ హరీష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో అసెంబ్లీ జరిగినప్పుడు దీని చుట్టూ ఉన్న హోటల్స్ అన్ని పైరవీల కోసం బిజీగా ఉండేవన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka mallu) చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. భట్టికి ఇప్పుడున్న ఆందోళన- భయం డెప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు 10శాతం ఉన్నా బాగుండేదంటూ పేర్కొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై స్టే తెచ్చాము- పనులు ఆపించామని పేర్కొన్నారు. మెడిగడ్డ నుంచి 93 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేశామని హరీష్ పేర్కొన్నారు.

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నుంచి ఆశించినంత మేరకు సలహాలు- సూచనలు రాలేదంటూ హరీష్ పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిపై తాము సొంతడబ్బా కొట్టుకోవడం లేదని.. తెలంగాణ అభివృద్ధి గురించి కేంద్రం ఇచ్చిన లెక్కలే చెప్తున్నామన్నారు. భట్టి విక్రమార్క మాట్లాడితే కనీసం బేసిస్ లేదని పేర్కొన్నారు. గాంధీ పేరు చెప్పుకొని 50 ఏళ్ళు దేశాన్ని పాలించారంటూ హరీష్ రావు.. కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. తెలంగాణ గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు బీజేపీ- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అంటూ ప్రశ్నించారు. గ్రామాల్లో అభివృద్ధిపై కాంగ్రెస్ – టీఆర్ఎస్ పాలనలో మార్పులపై భట్టి నియోజకవర్గం మధిరకు వెళ్దామంటూ హరీష్ రావు సవాల్ చేశారు. దీనికి ఒప్పుకుంటే వెళ్తామంటూ సూచించారు.

భట్టి విక్రమార్క తన వెంట వస్తే సిద్దిపేటకు తీసుకెళ్తానంటూ సూచించారు. కాలువల్లో నీళ్లు ఉన్నాయో లేవో చూసి ఆయనే చెప్పాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 2లక్షల 30వేలకు పైగా నీళ్లు ఇచ్చామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితం మొత్తం 8లక్షల 10వేల ఎకరాలకు నీళ్లు అందినట్లు పేర్కొన్నారు. మంజీరా- కూడవెళ్లి నీళ్లు గోదావరిలో కలిసేది మాత్రమే మనకు తెలుసు.. కానీ కేసీఆర్ గోదావరి నీళ్లనే మంజీరా- కూడేల్లిలోకి నింపుతున్నారన్నారు. సొంత రాష్ట్రంలో ఎండకాలం కూడా వానకాలం లాగా కనిపిస్తోందంటూ హరీష్ తెలిపారు.

Also Read:

YCP vs TDP: వైసీపీ, టీడీపీ మధ్య చిచ్చుపెట్టిన మావోయిస్టుల లేఖ.. ఇంతకీ అందులో ఏముందంటే..?

Russia-Ukraine War: రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం భారత ఆటోమొబైల్ రంగానికి లాభామా.. నష్టమా..