AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP vs TDP: వైసీపీ, టీడీపీ మధ్య చిచ్చుపెట్టిన మావోయిస్టుల లేఖ.. ఇంతకీ అందులో ఏముందంటే..?

Maoist warning letter: విశాఖ జిల్లా పాడేరు అధికార పార్టీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి టార్గెట్‌గా మావోయిస్టులు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి లక్షలాది రూపాయలు తీసుకుని లాటరైట్ పేరుతో బాక్సైట్ తరలించేందుకు

YCP vs TDP: వైసీపీ, టీడీపీ మధ్య చిచ్చుపెట్టిన మావోయిస్టుల లేఖ.. ఇంతకీ అందులో ఏముందంటే..?
Tdp Vs Ycp
Shaik Madar Saheb
|

Updated on: Mar 09, 2022 | 4:41 PM

Share

Maoist warning letter: విశాఖ జిల్లా పాడేరు అధికార పార్టీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి టార్గెట్‌గా మావోయిస్టులు రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి లక్షలాది రూపాయలు తీసుకుని లాటరైట్ పేరుతో బాక్సైట్ తరలించేందుకు అనుమతి ఇచ్చారనేది ఆ లేఖలో ప్రధాన ఆరోపణ. వెంటనే మైనింగ్‌ ఆపి, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మన్యం వదిలి వెళ్లకపోతే కిడారు సర్వేశ్వరరావు, సివేరి సోమాలకు పట్టిన గతే పడుతుందని లేఖలో మావోయిస్టులు తీవ్ర హెచ్చరిక చేశారు. ఈ లేఖ ఫెయిర్‌ కాదని, దాని వెనుక టీడీపీ ప్రమేయం ఉందని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి (Bhagya Lakshmi) అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కిడారికి మావోయిస్టులు ఇలాగే లేఖ రాసి, తర్వాత ఆయనను హత్య చేశారు. అయితే… మావోయిస్టు పార్టీ విశాఖ ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో రాసిన లేఖపై పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి స్పందించిన తీరు ఆసక్తికరంగా మారింది. బాక్సయిట్ తవ్వకాలను ఎమ్మెల్యే స్వయంగా ప్రోత్సహిస్తున్నారని, వెంటనే దానిని ఆపి, మన్యం వదిలి పారిపోవాలని లేదంటే మాజీ ఎమ్మెల్యేలు కిడారు, సోమాలకు పట్టిన గతే పడుతుందని తీవ్ర హెచ్చరిక ఉన్న ఆ లేఖను ఎమ్మెల్యే చాలా ఈజీగా తీసుకున్నారు. అసలు అక్కడ మైనింగ్ జరగడం లేదని, బాక్సయిట్‌ తవ్వకాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని, అలాంటప్పుడు ఆ లేఖకు అర్థం లేదంటున్నారు ఎమ్మెల్యే. ఆ లేఖ ఫెయిరా లేక దాని వెనుక టీడీపీ ప్రమేయం ఏమైనా ఉందేమోనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏమైనా కిడారి హత్య ఘటన మరచిపోకముందే హెచ్చరిక లేఖ రావడంపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి.

ఏజెన్సీ లో అధికార పార్టీ నేతలు, మావోయిస్టుల మధ్య ఎప్పుడూ కోల్డ్ వార్ నడుస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మన్యంలో మైనింగ్ చేయకూడదన్నది మావోల విధానం. దాని ద్వారా అడవి బిడ్డల గూడు చెదిరిపోతుందని, అడవి అంతా కాలుష్యం అయిపోతుందని మావోలు చెబుతుంటారు. అందులోనూ విలువైన బాక్సైట్ ని తవ్వడానికి రకరకాల రూపాల్లో వస్తున్నారని, ఇలాంటి వారిని ప్రజా కోర్టులో శిక్షించడం తప్పదని హెచ్చరిస్తూ ఉంటుంది మావోయిస్టు పార్టీ. వీటితో పాటు స్థానిక అంశాల ఆధారంగా అధికారంలో ఉన్న నేతలు టార్గెట్‌ గా మావోల ప్రణాళికలు నిరంతరం సాగుతుంటాయి. తాజా లేఖ వెనుక టీడీపీ ప్రమేయం ఉందన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలు పొలిటికల్‌ హీట్‌కు కారణమయ్యాయి.

గతంలో అరకు ఎమ్మెల్యేగా అప్పటి అధికార పార్టీ టీడీపీలో చేరిన తర్వాత కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమాల హత్య అనంతరం మావోయిస్టు ఈస్ట్ విశాఖ డివిజన్ కార్యదర్శి అరుణ పేరిట ఓ లేఖ విడుదలైంది. కిడారి, సోమాలు గిరిజన ద్రోహులుగా, బాక్సైట్ తవ్వకాల కోసం జిందాల్, రస్ ఆల్ ఖైమా, ఆన్ రాక్‌లకు ఏజెంట్లుగా మారారని, అందుకే వారిద్దర్నీ హతమార్చినట్లు లేఖలో పేర్కొన్నారు. ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాల కోసం ఇచ్చిన జీవోలను కొట్టివేయాలన్న డిమాండ్ కూడా మావోయిస్టులు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కిడారి హత్య తర్వాత అరకు పక్క నియోజకవర్గమైన పాడేరుకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి టార్గెట్‌గా మావోయిస్టు పార్టీ రాసిన లేఖ ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

మావోయిస్టుల లేఖలో ఆరోపణలను ఎమ్మెల్యే కొట్టిపారేశారు. లేఖలో ఆరోపణలు వాస్తవం కావని ఆమె టీడీపీపై అనుమానం వ్యక్తంచేశారు. అయితే.. వైసీపీ ఎమ్మెల్యే వాదనను టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా ఖండించారు. మావోయిస్టుల లేఖతో టీడీపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాగా.. లేఖతో విశాఖపట్నం రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

Also Read:

AP: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన డిప్యూటి సీఎం చేతి రింగ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Andhra Pradesh: ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్.. అధికారులకు కీలక ఆదేశాలు