AP: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన డిప్యూటి సీఎం చేతి రింగ్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Deputy CM K.Narayana Swamy: తమిళనాడు బార్డర్‌లో ఉండే ఈ ఏరియా చాలా ప్రత్యేకమైంది. అందుకే, అక్కణ్నుంచి ఎన్నికైన నారాయణస్వామికి కూడా రాజకీయంగా ప్రత్యేకత ఉంది. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణ స్వామి.
ఇప్పుడు ఆయన కుడిచేతి వేలికున్న ఉంగరం.. రాజకీయంగా హాట్ టాపిక్ అవుతోంది. అదేమైనా దేవుడి ఉంగరమా? అంటే అస్సలు కాదు. కానీ, అదంటే ఆయనకు ఎంతో స్పెషల్. ఈ ఉంగరంలో రెండు ఫొటోలు ఉన్నాయి. ఒకటి సీఎం జగన్మోహన్ రెడ్డిదైతే(CM Jagan Mohan Reddy).. మరొకటి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది(YS Rajasekhara Reddy). మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణస్వామిని.. జగన్ సీఎం అయ్యాక ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. అందుకే, తన భక్తిని ఇలా చాటుకునే ప్రయత్నంచేస్తున్నారు నారాయణస్వామి. ఇలా, ఈ ఇద్దరు నేతలతో కూడిన బంగారు రింగు తయారీలో అడుగడుగునా.. తమిళనాడు కల్చర్‌ని ఫాలో అయ్యారాయన. అయితే, ఎందుకిలా ఉంగరంతో భక్తి చాటుకున్నారనే చర్చ కూడా జరుగుతోంది. తమిళనాడు బార్డర్‌లో ఉండే ఈ ఏరియా చాలా ప్రత్యేకమైంది. అందుకే, అక్కణ్నుంచి ఎన్నికైన నారాయణస్వామికి కూడా రాజకీయంగా ప్రత్యేకత ఉంది. చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణ స్వామి.
జగన్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటిపోయింది. కాబట్టి, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. తనకు పదవీ గండం ఉందేమోనన్న భయంతోనే నారాయణస్వామి ఇలా ఉంగరంతో భక్తి చాటుతున్నారా? లేక వైఎస్ కుటుంబంపై అభిమానాన్ని ఈవిధంగా చాటుకుంటున్నారా? అనే చర్చ జరుగుతోంది. అయితే, తమిళనాడు కల్చర్‌ను ఎక్కువగా ఫాలో అయ్యే నారాయణస్వామి.. అదృష్టం వరిస్తుందనే నమ్మకంతోనే ఇలా ఉంగరం చేయించుకుని ఉంటారనే వారూ ఉన్నారు. బార్డర్‌లో ఉండే తన నియోజకవర్గంలో ఎక్కువగా.. తమిళ సంస్కృతిని పాటించే జనం ఉంటారు. వారిని ఆకట్టుకోవడంలో ఇదీ భాగమనే అభిప్రాయమూ ఉంది.
తనకు రాజకీయంగా ఉన్నత స్థానం కల్పించిన ఇద్దరు నేతల్ని దేవుళ్లలా భావిస్తున్నారట నారాయణస్వామి . అందుకే, ఉదయం నిద్రలేవగానే, వారి దర్శనం చేసుకునేలా ఫొటోలతో ఈ రింగు చేయించుకున్నారట. మరి, ఈ స్వామిభక్తి నారాయణ స్వామి పదవిని కాపాడుతుందా? లేదా? అనేది మరికొన్ని రోజుల్లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణతో తేలిపోతుంది.
ఇవి కూడా చదవండి: Eyes Care Tips: కళ్లల్లో మంట, దురదతో ఇబ్బంది పడుతున్నారా? ఈ హోం రెమెడీస్‌ని అనుసరించండి..
Russia Ukraine War Live: ఉక్రేనియన్ సైన్యం చేతిలో మరో రష్యన్ సైనికాధికారి మృతి