UP Election Results 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రముఖల భవితవ్వం తేలేది రేపే..

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. అధికార బీజేపీతో సహా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించాయి.

UP Election Results 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రముఖల భవితవ్వం తేలేది రేపే..
Up Results
Balaraju Goud

|

Mar 09, 2022 | 2:28 PM

Uttar Pradesh Election Results 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడానికి కొద్ది గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారింది. అధికార భారతీయ జనతా పార్టీ(BJP)తో సహా అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని విస్తృతస్థాయిలో ప్రచారం నిర్వహించాయి. ఓడిపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adithyanath) నుంచి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య(Kesav Prasad Mourya), అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav)  బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల వరకు పలువురు నేతల పేర్లు కూడా ఉన్నాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నాయకుడు ఓడిపోయినా.. గౌరవప్రదంగానే ఉంటారు. ఎందుకంటే వీరిలో ఒకరు ఎమ్మెల్సీ, మరికొందరు ఎంపీ. అటువంటి పరిస్థితిలో, తమకు ఓటమి వల్ల నష్టం జరగదని, గెలిచిన తర్వాత, ఏ స్థానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోనున్నారు.

 యోగి ఆదిత్యనాథ్

ముందుగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ స్థానంలో పోటీ చేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2017 సెప్టెంబర్‌లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి అప్రతిహతంగా గెలుపొందారు. MLC పదవీకాలం 6 సంవత్సరాలు, కాబట్టి అతనికి గౌరవప్రదంగా ఇంకా ఒక సంవత్సరం మిగిలి ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను బట్టి చూస్తే.. గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి సీఎం యోగి గెలుస్తారని చెబుతున్నారు. ప్రస్తుత ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్‌ వాల్ జిల్లా, పాంచూర్ గ్రామంలో 1972 జూన్ 5న జన్మించిన యోగీ.. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీచేస్తున్నారు. గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. శాసనమండలికి ఏకగ్రీవంగా ఎన్నికై ప్రస్తుతం సీఎం పదవిలో కొనసాగుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోడీ వారసుడు యోగి ఆదిత్యనాథ్ అని విశ్వసిస్తుంటారు బీజేపీ శ్రేణులు. 1998 నుంచి గోరఖ్ పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ నుంచి ఐదుసార్లు వరుసగా ఎంపీగా గెలుపొందారు యోగి ఆదిత్యానాథ్. గోరఖ్ పూర్ మఠాధిపతిగా ఉన్న యోగి.. తన తండ్రి మహంత్ అవైద్యనాథ్ మరణాంతరం మఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2017 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ముందుండి పార్టీకి విజయం అందించి, అనుహ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

కేశవ్ ప్రసాద్ మౌర్య ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య కూడా 2017 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో డిప్యూటీ సీఎం అయ్యాక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన కౌశాంబి జిల్లా సిరథు సీటులో రంగంలోకి దిగారు. ఆయన గెలుపుపై​సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. యూపీలోని కౌశంబి జిల్లాలోని సిరథులో 1969 మే 7న జన్మించిన కేశవ్ ప్రసాద్ మౌర్య.. ఆర్ ఎస్సెస్, వీహెచ్ పీ, బజరంగ్ దళ్ తో అనుబంధం కలిగి ఉన్నారు. బీజేపీ కిసాన్ మోర్చా నేతగా ప్రాముఖ్యత పొందిన కేశవ్.. 2002, 2007లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేశారు. 2012లో అసెంబ్లీ కి సిరథు నియోజకవర్గం నుంచి ఎన్నికైన కేశవ్.. రెండున్నర ఏళ్ల అనంతరం 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఫూల్ పూర్ నుంచి విజయం సాధించారు. కేంద్రమంత్రిగా పనిచేసిన కేశవ్ ప్రసాద్ మౌర్య.. 2016లో యూపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. అనంతరం శాసనమండలికి కేశవ్ ప్రాతినథ్యం వహిస్తున్నారు.

ఇక, పోటీ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి SP సింగ్ బఘేల్ అసెంబ్లీ బరిలో నిలిచారు. అగ్రా నియోజకవర్గం నుంచి ఎంపీ అయిన బఘేల్.. అఖిలేష్ యాదవ్‌పై మైన్‌పురి జిల్లా కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఎస్పీ సింగ్ బఘెల్ ఇక్కడ గెలుపు ఓటమికి పెద్దగా తేడా ఉండదనే చెప్పాలి.

అఖిలేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కర్హల్ సీటుపై అఖిలేష్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ అజంగఢ్ నియోజకవర్గ పార్లమెంటు సభ్యులగా ఉన్నారు. గెలిచినా, ఓడినా ఆయన గౌరవప్రదమైన హోదా కూడా అలాగే ఉంటుంది. ఎగ్జిట్ పోల్స్‌లో అఖిలేష్ యాదవ్ గెలుపు ఖాయమని చెబుతున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో అజంఖాన్ పేరు ఎస్పీ మాటల్లోనే కాదు బీజేపీ నేతల మాటల్లో కూడా మారుమోగింది. ప్రస్తుతం ఆజం ఖాన్ జైలులో ఉన్నారు. ఆజం ఖాన్ జైలు నుంచి రాంపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఆజం ఖాన్ రాంపూర్ ఎంపీ కూడా. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సీటు ఓడిపోయినా.. దాని వల్ల ఎలాంటి మార్పు ఉండదు.

అఖిలేష్ యాదవ్ యూపీలోని ఇటావా జిల్లా, సైఫాయ్ గ్రామంలో 1973 జులై 1న జన్మించిన అఖిలేష్ యాదవ్.. రాష్ట్రానికి 20వ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2000వ సంవత్సరంలో కన్నోజ్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తొలిసారిగా లోక్ సభకు ఎన్నికైన అఖిలేష్.. అనంతరం అదే నియోజకవర్గం నుంచి 2004, 2009 లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 2012లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ ఘన విజయం సాధించడంతో.. లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అఖిలేష్ యూపీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం శాసన మండలికి ఎన్నికైన ఆఖిలేష్.. బీజేపీ హయాంలో ప్రతిపక్ష పాత్ర పోషించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో అజాంగర్ నుంచి ఎన్నికైన అఖిలేష్.. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కర్హం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

అదితి సింగ్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా చెప్పుకునే రాయ్ బరేలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత అదితి సింగ్ మరోసారి ఎమ్మెల్యేగా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్నోలో 1987 నవంబర్ 15న జన్మించిన అదితి సింగ్.. 17వ శాసనసభకు అతి తక్కువ వయసు సభ్యురాలుగా ఎన్నికై రికార్డు సృష్టించారు. మొదట కాంగ్రెస్ లో చేరిన అదితి.. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ పై రాయ్ బరేలి నుంచి విజయం సాధించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ బీజేపీతో సంబంధం కలిగివుందన్న ఆరోపణలతో పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన అదితి.. 2017 నవంబర్ 24న బీజేపీలో చేరిపోయారు. ఈ ఎన్నికల్లో మరోసారి రాయ్ బరేలి నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

ఓం ప్రకాష్ రాజ్‌బర్ ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ బరిలో నిలిచిన మరోనేత ఓం ప్రకాష్ రాజ్‌బర్. సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్పీ) అధ్యక్షుడు అయిన ఓం ప్రకాష్.. జహూరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 1962లో వారణాసి జిల్లాలోని కటువా గ్రామంలో జన్మించిన ఓం ప్రకాశ్ రాజ్ బర్.. వ్యవసాయదారుడిగా వృత్తి ప్రారంభించిన రాజకీయనేతగా ఎదిగారు. సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ సభ్యుడిగా కెరియర్ ప్రారంభించిన ప్రకాశ్ రాజ్ బర్.. వెనకబడ్డ తరగతులకోసం పాటుపడుతున్న ఎస్ బీ ఎస్పీ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో జహూరాబాద్ నుంచి గెలుపొందారు.బీజేపీ ప్రభుత్వంలో చేరి కేబినేట్ మంత్రి పదవి పొందిన ఓం ప్రకాశ్.. 2019 లో కూటమి వ్యతిరేక కార్యకలాపాలకు మంత్రి పదవి పోగొట్టుకున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తుతో పోటీచేస్తున్నారు.

శివపాల్ సింగ్ యాదవ్ సీనియర్ నేత ఎస్పీ వ్యవస్థాపక సభ్యుడు అయిన మాజీ మంత్రి శివపాల్ సింగ్.. పార్టీలో విభేదాల కారణంగా ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) స్థాపించారు. 1996 నుంచి జస్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎస్పీతో వేరుపడి 2018లో ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ(లోహియా) ను స్థాపించిన శివపాల్ సింగ్.. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తులో భాగంగా శివపాల్ సింగ్ ఎస్పీ గుర్తుతో బరిలో నిలిచారు. ప్రస్తుతంజస్వంత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు భీమ్ రాజ్ భర్.. ‘మౌ’ నియోజకవర్గం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మౌ జిల్లాలోని మహ్మద్ పూర్ బాబుపూర్ గ్రామానికి చెందిన భీమ్ రాజ్ భర్ 1980లో బీఎస్పీలో చేరారు. 2002లో మౌ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి పాలయ్యారు. బీఎస్పీ నుంచి బయటకు వచ్చిన ఆయన 2021లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మౌ నుంచి పోటీకి దిగుతున్నారు భీమ్. ఈ నియోజకవర్గం బీఎస్పీ కంచుకోటగా ప్రసిద్ధి పొందింది

బరిలో ఉన్న ఇతర ప్రముఖుల్లో బీజేపీ అభ్యర్థులు…

శ్రీకాంత్ శర్మ – మథుర సురేశ్ రాణా – థానా భవన్ పంకజ్ సింగ్ – నొయిడా మృంగాకా సింగ్ – కైరానా బేబిరాణి మౌర్య – అగ్రా రూరల్ సిద్ధార్థ్ నాథ్ సింగ్ – అలహాబాద్ వెస్ట్ నందగోపాల్ గుప్తా నంది – అలహాబాద్ సౌత్

సమాజ్ వాదీ పార్టీ నుంచి…

ఆజం ఖాన్ – రామ్ పూర్ అనురాగ్ సింగ్ భాదౌరియా – లక్నో ఈస్ట్ స్వామి ప్రసాద్ మౌర్య – ఫాజిల్ నగర్

కాంగ్రెస్ నుంచి…

లూయీస్ ఖుర్షీద్ – ఫరుఖాబాద్ అజయ్ కుమార్ లల్లూ – తముఖి రాజ్

Read Also…. 

Election Results 2022: యూపీ, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్‌లలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎన్ని సీట్లు అవసరమో తెలుసా?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu