Telangana: కొండ గుహ నుంచి వింత శబ్దాలు.. భయపడుతూ వెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.!

చిన్న పామును చూస్తేనే ఉలిక్కిపడుతాం. అలాంటిది ఏకంగా పదికి మించి పాములు ఒకే చోట కనిపిస్తే.. ఇంకేముంది పై ప్రాణాలు పైనే...

Telangana: కొండ గుహ నుంచి వింత శబ్దాలు.. భయపడుతూ వెళ్లి చూడగా ఫ్యూజులు ఔట్.!
Viral
Follow us

|

Updated on: Mar 08, 2022 | 4:55 PM

చిన్న పామును చూస్తేనే ఉలిక్కిపడుతాం. అలాంటిది ఏకంగా పదికి మించి పాములు ఒకే చోట కనిపిస్తే.. ఇంకేముంది పై ప్రాణాలు పైనే పోతాయి. అక్కడ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదుల సంఖ్యలో పాములు గ్రామస్థులను కలవర పెట్టాయి. అవి కూడా ఏ చిన్నా చితకా పాములో కావు.. ఏకంగా పది అడుగులకు మించిన కొండ చిలువలు కనిపించడంతో గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు.

అసలు విషయానికొస్తే.. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో కొండచిలువలు కలకలం రేపాయి. లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేటలో పదుల సంఖ్యలో కొండచిలువలు గ్రామస్థులను కలవరపెట్టాయి. గ్రామానికి పక్కనే ఉన్న ఓ కొండపై బండరాళ్ల మధ్య కొండచిలువలు నక్కి ఉన్నాయి. ఈ మధ్యే కొండపై రామాలయం నిర్మాణానికి పూనుకున్నారు గ్రామస్థులు. కొండ పరిశీలనకు వెళ్లారు. అక్కడ కనిపించిన కొండచిలువలను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పది అడుగుల మేర ఉన్న కొండ చిలువలను చూసిన గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు గ్రామానికి చేరుకుని కొండచిలువలను పట్టి అడవిలో వదలడంలో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.