Cricket: 53 పరుగులకే 7 వికెట్లు.. కట్ చేస్తే ప్రత్యర్ధి బౌలర్లపై కెప్టెన్ పెను విధ్వంసం.. చివరికి..
పరిస్థితి ఎలాంటిదైనా.. ప్రత్యర్ధి జట్టు ఎంత బలమైనది అయినా.. కెప్టెన్ అనేవాడు తమ జట్టును ముందుంది నడిపించాలి.
పరిస్థితి ఎలాంటిదైనా.. ప్రత్యర్ధి జట్టు ఎంత బలమైనది అయినా.. కెప్టెన్ అనేవాడు తమ జట్టును ముందుంది నడిపించాలి. చివరి వరకు ఓటమిని ఒప్పుకోకూడదు. సరిగ్గా ఇక్కడా ఇదే జరిగింది. పురుషుల ప్రపంచ కప్ లీగ్-2(2019-23)లో ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఓ జట్టు కెప్టెన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడి.. తన జట్టును పటిష్ట స్థితిలో ఉంచడమే కాదు.. విజయతీరాలకు చేర్చాడు. ఇక ఆ మ్యాచ్ ఆదివారం దుబాయ్ వేదికగా ఒమన్, నమీబియా జట్ల మధ్య జరిగింది. ఇందులో నమీబియా కెప్టెన్ ఎరాస్మస్ సూపర్ సెంచరీతో ప్రత్యర్ధి బౌలర్లను బెంబేలెత్తించాడు. ఆ విశేషాలు ఏంటో చూసేద్దాం పదండి..
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న నమీబియాను.. ఒమన్ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టారు. వారి దెబ్బకు నమీబియా జట్టు 53 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. తక్కువ స్కోర్‌కే చాప చుట్టేస్తుందని అనుకున్న సమయంలో.. ఆ జట్టు కెప్టెన్ ఎరాస్మస్(121) చివరి వరకు ఒంటరి పోరాటం చేశాడు. చివరి రెండు వికెట్ల సహాయంతో స్కోర్‌ను 200 దాటించాడు. ఈ క్రమంలోనే తన సెంచరీని పూర్తి చేశాడు. 120 బంతులు ఎదుర్కున్న ఎరాస్మస్.. 9 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 121 పరుగులు చేశాడు. ఫలితంగా నమీబియా జట్టు నిర్ణీత ఓవర్లకు 226 పరుగులకు ఆలౌట్ అయింది.
116 పరుగులకు ఒమన్ జట్టు ఆలౌట్.. 227 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఒమన్ జట్టు.. నమీబియా బౌలర్ల ధాటికి 116 పరుగులకే ఆలౌటైంది. నమీబియా బౌలర్లలో స్మిత్, వైస్, లుంగామేని, ఫ్రైలింక్ రెండేసి వికెట్లు తీయగా.. మైకేల్, రుబెన్ చెరో వికెట్ పడగొట్టారు. దీనితో నమీబియా 110 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.
Also Read:
Akhil Akkineni : బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌తో అక్కినేని ప్రిన్స్ భారీ మూవీ ప్లాన్..
ముమైత్ ఎలిమినేటెడ్.. వెక్కివెక్కి ఏడుస్తూ ఎమోషనల్.. వీడియో