IIT Bombay CEED 2022 ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు ఎప్పటినుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..
కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (CEED - 2022) ఫలితాలు ఈ రోజు (మార్చి 8)న విడులైనట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Bombay) బొంబాయి తెలియజేసింది..
CEED 2022 results declared: కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (CEED – 2022) ఫలితాలు ఈ రోజు (మార్చి 8)న విడులైనట్లు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Bombay) బొంబాయి తెలియజేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ www.ceed.iitb.ac.in.లో చెక్ చేసుకోవచ్చు. ఫలితాలకు సంబంధించిన CEED 2022 స్కోర్ కార్డును మార్చి 12 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెల్పింది. కాగా సీడ్ 2022 పరీక్ష ఈ ఏడాది జనవరి 23 (ఆదివారం) ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ జనవరి 31న వెలువడింది. సీడ్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు దేశ వ్యాప్తంగా వివిధ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎమ్‌డీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు ప్రవేశం పొందడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా CEED 2022 స్కోర్ వ్యాలిడిటీ ఫలితాలు ప్రకటించిన తేదీ నుంచి సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది.
CEED 2022 ఫలితాలు ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..
- ముందుగా అధికారిక అధికారిక వెబ్‌సైట్www.ceed.iitb.ac.in.ను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్‌పేజ్‌లో కనిపించే result tab పై క్లిక్ చెయ్యాలి.
- తగిన ఆధారాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- డౌన్‌లోడ్ చేసుకుని, హార్డ్ కాపీని ప్రింట్ ఔట్ తీసుకోవాలి.
Also Read: