IOCL Recruitment 2022: నెలకు రూ. 1,05,000 జీతంతో..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..

భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో రిఫైనరీస్‌ డివిజన్‌ పరిధిలోని బరౌనీ రిఫైనరీ.. జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Junior Engineering Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది..

IOCL Recruitment 2022: నెలకు రూ. 1,05,000 జీతంతో..ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు..
Iocl
Follow us
Srilakshmi C

|

Updated on: Mar 08, 2022 | 8:47 AM

IOCL Engineering Assistant Recruitment 2022: భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)లో రిఫైనరీస్‌ డివిజన్‌ పరిధిలోని బరౌనీ రిఫైనరీ.. జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టుల (Junior Engineering Assistant Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 4

ఖాళీల వివరాలు: జూనియర్‌ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ (Production) పోస్టులు

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుండి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: రూ. 25,000 – 1,05,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో కెమికల్‌/రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్‌ ఇంజనీరింగ్‌లో డిప్లొమా/ఎంపీసీ లేదా ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీలో బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 29, 2022.

రాత పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

IIT Bombay CEED 2022 ఫలితాలు విడుదల.. స్కోర్‌ కార్డు ఎప్పటినుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే..