AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: మైదానంలో పొట్టుపొట్టు తిట్టుకున్న షేన్ వార్న్, వెస్టిండీస్ ప్లేయర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఆనాటి వీడియో..

ఈ మ్యాచ్‌లో షేన్ వార్న్ తన ప్రశాంతతను కోల్పోయాడు. అతను వెస్టిండీస్ లెజెండరీ బ్యాట్స్‌మెన్ మార్లోన్ శామ్యూల్స్‌తో గొడవపడ్డాడు. వార్న్ మరణానంతరం, అతని ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది.

Watch Video: మైదానంలో పొట్టుపొట్టు తిట్టుకున్న షేన్ వార్న్, వెస్టిండీస్ ప్లేయర్‌.. నెట్టింట్లో వైరలవుతోన్న ఆనాటి వీడియో..
Shane Warne And Marlon Samuels
Venkata Chari
|

Updated on: Mar 08, 2022 | 10:13 AM

Share

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్(Shane Warne) శుక్రవారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలసిందే. 52 ఏళ్ల వయసులో ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. వార్న్ థాయ్‌లాండ్‌లో మరణించాడు. ఇదిలా ఉంటే, వార్న్‌కు సంబంధించిన అనేక కథనాలను పలువురు మాజీ క్రికెటర్లు పంచుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో, ప్రత్యక్ష మ్యాచ్‌లో షేన్ వార్న్ తన ప్రశాంతతను కోల్పోయిన వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరలవుతోంది.  2013లో ఆస్ట్రేలియా(Australia) డొమెస్టిక్ లీగ్ బిగ్ బాష్‌లో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ హస్సీ రెండో పరుగు తీసేందుకు ప్రయత్నించగా.. బౌలింగ్‌లో ఉన్న ఈ ఆస్ట్రేలియా దివంగత ప్లేయర్ షేన్ వార్న్.. వెస్టిండీస్ ప్లేయర్ మార్లోన్ శామ్యూల్స్(Marlon Samuels) టీషర్ట్ పట్టుకుని అడ్డుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.

ఈ మొత్తం సంఘటనతో షేన్ వార్న్ ఆగ్రహానికి గురయ్యాడు. మైదానంలో ఇద్దరూ ఒకరినొకరు ఎదుర్కొన్నప్పుడు, వార్న్ శామ్యూల్స్ టీ-షర్ట్ పట్టుకుని తీవ్రంగా దుర్భాషలాడాడు. లైవ్ మ్యాచ్ సందర్భంగా ఇద్దరి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. ఇది కాకుండా, మ్యాచ్ సమయంలోనే, వార్న్ విసిరిన త్రోతో శామ్యూల్స్ కోపంగా ఉన్నాడు. దీంతో వార్న్‌పై కోపంతో అతని బ్యాట్‌ని విసిరాడు.

శామ్యూల్స్‌ను వార్న్ ఫాలో అవుతున్నట్లు వీడియోలో చూడవచ్చు. అతను బౌలింగ్ చేస్తున్నప్పుడు శామ్యూల్స్‌ను చాలాసార్లు ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తాడు. తన స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే షేన్ వార్న్, చాలా సందర్భాలలో తన స్లెడ్జింగ్‌తో కీలక బ్యాట్స్‌మెన్‌లకు కూడా సమస్యలు సృష్టించాడు.

Also Read: Cricket: 53 పరుగులకే 7 వికెట్లు.. కట్ చేస్తే ప్రత్యర్ధి బౌలర్లపై కెప్టెన్ పెను విధ్వంసం.. చివరికి..

India vs Sri Lanka 2nd Test: రెండో టెస్టులో కీలక మార్పులు.. జట్టులో చేరిన డే అండ్ నైట్ మ్యాచ్ స్పెషలిస్ట్ ప్లేయర్..