Sachin Tendulkar Video: సచిన్ కాపాడిన చిన్ని ప్రాణం.. సలామ్ కొడుతున్న నెటిజన్లు..! ఎమోషన్ చేస్తున్న వీడియో…
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. సచిన్‌కు సలామ్ కొడుతున్నారు. ఇంతకీ సచిన్ ఏం చేశారు? సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సచిన్.. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు.
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు.. సచిన్‌కు సలామ్ కొడుతున్నారు. ఇంతకీ సచిన్ ఏం చేశారు? సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సచిన్.. తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో సచిన్ గాయపడిన ఓ సీగల్‌కి ప్రాణం పోశారు. బీచ్‌లో గాయపడి నిస్సాహయంగా పడి ఉన్న సీగల్ కంట పడింది. దానిని చేరదీసిన సచిన్.. ఆ సీగల్‌కి నీరు తాగించారు. అనంతరం దానిని చేతిలో పెట్టుకుని ఆహారం దగ్గరకు తీసుకెళ్లారు. పక్కనే ఉన్న ఓ రెస్టారెంట్‌లో సీగల్ కోసం కొంత ఆహారం పెట్టారు. అయితే సీగల్ రెక్కలు బాగానే ఉన్నాయని, ఎడమ కాలికి మాత్రం గాయమైందని సచిన్ చెప్పుకొచ్చారు. పూర్తిగా తగ్గేవరకు సంరక్షిస్తానని చెప్పారు సచిన్.కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసిన సచిన్.. ‘‘కొంచెం శ్రద్ధ, ఆప్యాయతతో మన ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ఎంత దూరమైనా వెళ్లవచ్చు!’’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది, దాదాపు 8 లక్షల మందికి పైగా చూశారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్‌లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

